రికార్డు సృష్టించిన భారత నగరం: ట్రాఫిక్ కష్టాల్లో ప్రపంచంలోనే రెండో స్థానం!
ప్రపంచవ్యాప్తంగా పెరిగిన రద్దీ నేపథ్యంలో నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ లొకేషన్ టెక్నాలజీ సంస్థ 'టామ్‌టామ్' తాజాగా 'గ్లోబల్ ట్రాఫిక్ ఇండెక్స్ 2025' నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా వాహనదారులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలపై నిర్వహించిన ఈ సర్వేలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2025వ సంవత్సారానికి టామ్‌టామ్ సంస్థ విడుదల చేసిన గ్లోబల్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం.. భారత సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు నగరం ట్రాఫిక్ సమస్యల్లో మరోసారి ప్రపంచ స్థాయి రికార్డు సృష్టించింది. ట్రాఫిక్ రద్దీలో ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకుని అందరినీ విస్మయానికి గురి చేసింది. గతేడాది(2024) మూడో స్థానంలో ఉన్న ఈ నగరం.. ఇప్పుడు మెక్సికో సిటీ తర్వాత అత్యంత నెమ్మదైన నగరంగా రికార్డు సృష్టించింది.
నత్తనడకన సాగుతున్న వాహనాలు
ఈ నివేదిక ప్రకారం.. బెంగళూరు రోడ్లపై ప్రయాణం నత్తనడకన సాగుతోంది. బెంగళూరులో వాహనాల సగటు వేగం గంటకు కేవలం 16.6 కిలోమీటర్లు మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. ఓ వాహనదారుడు కేవలం 4.2 కిలోమీటర్ల దూరాన్ని దాటడానికి సగటున 15 నిమిషాల సమయం కేటాయించాల్సి వస్తోంది. అంటే నగరవాసులు తమ జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని రోడ్లపైనే గడుపుతున్నారు. ముఖ్యంగా 2025 మే 17, శనివారం నాడు నగరంలో అత్యంత అధ్వాన్నమైన ట్రాఫిక్ నమోదైందని.. ఆ రోజు సాయంత్రం వేళల్లో కిలోమీటరు దూరం వెళ్లడం కూడా గగనమైందని నివేదిక పేర్కొంది.

ఏటేటా పెరుగుతున్న సంక్షోభం
బెంగళూరులో ట్రాఫిక్ సమస్య కాలక్రమేణా జటిలమవుతోందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2023లో ప్రపంచవ్యాప్తంగా 6వ స్థానంలో ఉన్న బెంగళూరు, 2024లో 3వ స్థానానికి, ఇప్పుడు 2025లో ఏకంగా 2వ స్థానానికి ఎగబాకింది. నగరంలో నమోదైన వాహనాల సంఖ్యే ఇందుకు ప్రధాన కారణం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కోటిగా ఉన్న రిజిస్టర్డ్ వాహనాల సంఖ్య, ఏప్రిల్ 2025 నాటికి 1.23 కోట్లకు చేరుకుంది. అంటే ఐదేళ్ల కాలంలో సుమారు 23 లక్షల కొత్త వాహనాలు రోడ్లపైకి వచ్చాయి, కానీ దానికి తగ్గట్టుగా రోడ్ల విస్తరణ జరగలేదు.
మౌలిక సదుపాయాల కొరత, ప్రణాళికా లోపం
బెంగళూరు నగరంలోని ట్రాఫిక్ సంక్షోభానికి కేవలం వాహనాల సంఖ్య పెరగడమే కాకుండా.. అస్తవ్యస్తమైన పట్టణ ప్రణాళిక కూడా కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు అధికంగా ఉండే వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ (ORR) వంటి ప్రాంతాల్లో మెట్రో పనులు ఆశించిన వేగంతో జరగడం లేదు. 2007లో ప్రారంభమైన 'నమ్మ మెట్రో' పనులు ఇంకా కీలకమైన ఐటీ కారిడార్లకు పూర్తిస్థాయిలో అనుసంధానం కాలేదు. దీనికి తోడు 2026లో పూర్తి కావాల్సిన సబర్బన్ రైల్వే ప్రాజెక్టు గడువు 2030కి వాయిదా పడటం నగరవాసుల పాలిట శాపంగా మారింది.
రవాణా వ్యవస్థ లోపం
ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా లేకపోవడంతో ప్రజలు అనివార్యంగా సొంత వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మెట్రో స్టేషన్ లేదా బస్టాప్ నుంచి గమ్యస్థానాలకు చేరుకోవడానికి సరైన షేర్ ఆటోలు లేకపోవడం, ఫుట్‌పాత్‌లు అధ్వాన్నంగా ఉండటం వల్ల నడక సాధ్యం కావడం లేదు. ఇరుకైన రోడ్లు, అక్రమ పార్కింగ్, అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్ పనులు ట్రాఫిక్ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. ప్రపంచ స్థాయి జాబితాలో మెక్సికో సిటీ ప్రథమ స్థానంలో ఉండగా, బెంగళూరుతో పాటు పుణె నగరం కూడా టాప్-5లో నిలవడం భారతీయ నగరాల్లో ట్రాఫిక్ నిర్వహణ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేస్తోంది.
ప్రపంచ స్థాయి జాబితా (టాప్ 5):
*మెక్సికో సిటీ
*బెంగళూరు (భారత్)
*డబ్లిన్ (ఐర్లాండ్)
*లోడ్జ్ (పోలాండ్)
*పుణె (భారత్)
-
విశాఖలో వాహనదారులకు హెచ్చరిక .. ఆ పని చేస్తే ఇక కష్టమే -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications