బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరుకు బంపర్ ఆఫర్, ఇక తాగునీటి సమస్య, ప్రజలకు పండగే పండగ, 15 ఏళ్లు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కావేరీ నీరు పంపిణి విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో బెంగళూరు నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ప్రతినిత్యం తాగునీటి సమస్యతో సతమతం అవుతున్న కొన్ని ప్రాంతాల ప్రజల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. సుప్రీం కోర్టు బెంగళూరు నగర ప్రజల ఆవేదన అర్థం చేసుకుని బంపర్ ఆఫర్ పకటించిందని, ఇక 15 ఏళ్లు ఏ సమస్యా ఉండదని అంటున్నారు.

Recommended Video

Cauvery Verdict : All You Need To Know About SC Final Verdict
బెంగళూరుకు గతంలో !

బెంగళూరుకు గతంలో !

బెంగళూరు నగరంలో దాదాపు అన్ని ప్రాంతాలకు కావేరీ తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కావేరీ నీటితోనే సామాన్య ప్రజలు దాహం తీర్చుకుంటున్నారు. ఇటీవల వరకూ బెంగళూరు నగరానికి 7.5 టీఎంసీల నీరు సరఫరా చేసేవారు.

సుప్రీం కోర్టు ఆదేశాలు

సుప్రీం కోర్టు ఆదేశాలు

కావేరీ నీరు పంపిణి విషయంలో ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం సుప్రీం కోర్టు తుదితీర్పు ఇచ్చింది. బెంగళూరు నగరానికి గతంలో సరఫరా చేస్తున్న 7.5 టీఎంసీల నీరుకు అదనంగా 4.75 టీఎంసీల నీరు సరఫరా చెయ్యడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది.

బెంగళూరుకు 30 టీఎంసీలు !

బెంగళూరుకు 30 టీఎంసీలు !

బెంగళూరు నగర ప్రజల అవసరాలు తీర్చడానికి 30 టీఎంసీల కావేరీ నీరు అవసరం అని కర్ణాటక ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో వాదించారు. అయితే కావేరీ జలాల పంపిణి విషయంలో సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాల వాదనలు పరిగణలోకి తీసుకుని బెంగళూరుకు 12.25 టీఎంసీల నీరు ఇవ్వడానికి అంగీకరించింది.

మాజీ ఉప ముఖ్యమంత్రి

మాజీ ఉప ముఖ్యమంత్రి

బెంగళూరు నగర ప్రజల దాహం తీర్చడానికి అదనంగా 4.75 టీఎంసీల నీరు మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఆర్. అశోక్ స్వాగతించారు. బెంగళూరు ప్రజలకు తాగునీరు చాల అవసరం అని ఆర్ అశోక్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

161 గ్రామాలకు కావేరీ !

161 గ్రామాలకు కావేరీ !

బెంగళూరు నగరంతో సహ బెంగళూరు గ్రామీణ జిల్లాలో తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న 161 గ్రామాలకు కావేరీ తాగునీరు సరఫరా చెయ్యడానికి ప్రభుత్వం సిద్దం అయ్యింది. మొత్తం మీద బెంగళూరు ప్రజలకు 4.75 టీఎంసీల నీరు అదనంగా కేటాయించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Cauvery Verdict: Karnataka to get additional 14.75 TMC and 177.25 TMC of water to be released for Tamilnadu , decides Supreme court and Bengaluru will get 4.75 TMC of Cauvery water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X