చెన్నై-బెంగళూరు మధ్య హైస్పీడ్ రైలు
రైల్వే ప్రయాణికులకు మంచి శుభవార్త. తరుచుగా బెంగళూరు నుంచి చెన్నైకి రైలులో ప్రయాణించేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని 2 గంటలు తగ్గించనున్నట్లు వెల్లడించింది. త్వరలోనే సెమీ హై స్పీడ్ రైలును ప్రవేశపెట్టబోతున్నారు.
కొద్ది నెలల వ్యవధిలోనే ఈ కొత్త సర్వీస్ ప్రారంభమవబోతోంది. రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ లతో కలిపి 16 కోచ్ లతో పూర్తిగా రిజర్వేషన్ చేసిన రైలుగా తీసుకురానున్నారు. కేవలం 2గంటల 15నిమిషాల వ్యవధిలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. కొత్తగా ప్రవేశపెట్టే ఈ సర్వీస్ వల్ల రెండు నగరాల మధ్య ఆర్థిక కార్యకలాపాలు మరింత పుంజుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణం కూడా చాలా సులభమవుతుంది. ఈ సర్వే కోసం రైల్వే మంత్రిత్వ శాఖ రూ.8.3కోట్లు కేటాయించింది. ఈ హై స్పీడ్ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది.

మెట్రోపాలిటన్ నగరాలతోపాటు దేశంలోని ప్రధానమైన నగరాల మధ్య ప్రయాణించే దూరాన్ని సాధ్యమైనంత తక్కువకు కుదించాలని రైల్వే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడున్న ట్రాక్ పై గంటకు 130 కిలోమీటర్ల వేగంతో కొన్ని రైళ్లు నడుస్తున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్, శతాబ్ది, రాజధాని లాంటి రైళ్లకు మించిన వేగంతో ఈ రైలు ప్రయాణించనుంది. ఈ రెండు నగరాల మధ్య హై స్పీడ్ రైలు వల్ల ప్రతిరోజు ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వందే భారత్ రైళ్లు ఇప్పటికే ప్రయాణికుల ఆదరణను చురగొన్నాయి. హై స్పీడ్ రైలు ప్రవేశపెట్టిన తర్వాత ఆదరణ బాగా దక్కించుకుంటుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications