భవానీపూర్ లో ప్రారంభమైన పోలింగ్ : భారీగా కేంద్ర బలగాల మొహరింపు: ఈసీ డేగకన్ను..!!

జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు కీలకంగా మారిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్ లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను మొహరించారు. భవానీపూర్‌తోపాటు జాంగీపూర్‌, సంపేర్‌గంజ్‌ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరుగుతున్నది. అక్టోబర్‌ 3న ఓట్లను లెక్కించనున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో పోలింగ్‌కు అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటుచేశారు.

20 కంపెనీల కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉప ఎన్నిక జరుగుతున్న స్థానాల్లో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పోటీచేస్తున్న భవానీ పూర్‌ కూడా ఉన్నది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి పోటీచేసిన దీదీ.. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాను ఓడినా..పశ్చిమ బెంగాల్ లో తన పార్టీని వరుసగా మూడో సారి అధికారంలోకి తీసుకొచ్చి..మూడోసారి సీఎం పీఠం దక్కించుకున్నారు.

Twenty additional companies of Central Armed Police Forces (CAPF) will be deployed in Bhabanipur ahead of the bypoll today. TMC chief Mamata Banerjee is contesting the bypoll.ప

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆరు నెలల కాలంలోగా చట్ట సభకు ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో.. దీదీ ప్రస్తుతం తన సొంత నియోజకవర్గమైన భవానీ పూర్‌ నుంచి బరిలోకి దిగారు. దీదీపై న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ను బీజేపీ పోటీకి దింపింది. బీజేపీ యువమోర్చాలో కీలంగా ఉన్న టిబ్రివాల్ మమత పైన పోటీ ద్వారా జాతీయ స్థాయిలో చర్చకు కారణమయ్యారు. అయితే, ఈ ఈ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ దూరంగా ఉన్నది. భవానీపూర్‌ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ 2011, 2016 ఎన్నికల్లో విజయం సాధించారు.

మమతా ఈ నియోకవర్గం నుంచి పోటీ చేసేందుకు వీలుగా.. భవానీపూర్‌ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సుభతా బక్షి.. దీదీ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన జంగీర్‌పూర్‌ నుంచి బరిలో నిలిచారు. భవానీపూర్‌లో 1,11,283 మంది పురుష, 95,209 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నలుగురు ఇతర ఓటర్లు ఉన్నారు. బీజేపీ ఫిర్యాదుల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ సాయంత్రం వరకు నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించారు. మొత్తం 97 పోలింగ్ కేంద్రాల్లోని 287 పోలింగ్ బూత్ ల్లో క్లోజ్ సెక్యూరిటీని ఏర్పాటు చేసారు.

Recommended Video

    India-China Stand Off : China దుశ్చర్య, 55 గుర్రాలపై 100 మంది సైనికులు చొరబాటు || Oneindia Telugu

    ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలను నియమించారు. అదే విధంగా 141 ప్రత్యేక వాహనాలను ఈవీఎం లను తరలించేందుకు సిద్దం చేసారు. రెండు స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేసారు. లార్డ్ సిన్హా రోడ్ శకావత్ మెమోరియల్ గర్ల్స్ హై స్కూల్ లో స్ట్రాంగ్ రూం సిద్దం చేసారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+