
భగవంత్ మాన్ మార్క్: పంజాబ్ క్యాబినెట్ ప్రమాణస్వీకారం చేసినరోజే తొలిసమావేశంలో సంచలన నిర్ణయం!!
పంజాబ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించి ఎన్నికలలో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాలుగు రోజుల క్రితం సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం చేయగా, తాజాగా భగవంత్ మాన్ క్యాబినెట్ లోని మంత్రులు ప్రమాణ స్వీకరం చేశారు. తొలిగా 11 మంది మంత్రులను ఎంపిక చేసుకున్నారు భగవంత్ మాన్. వారితో ఈరోజు గవర్నర్ ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు.
హిజాబ్
తీర్పిచ్చిన
న్యాయమూర్తులకు
బెదిరింపులు;
ముగ్గురు
తమిళనాడు
తౌహీద్
జమాత్
కార్యకర్తలపై
కేసునమోదు

మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సమావేశంలోనే ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్
ఈరోజు మంత్రుల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన తొలి సమావేశంలో, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. పంజాబ్ రాష్ట్ర శాఖలు, బోర్డులు మరియు కార్పొరేషన్లలో 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసు శాఖలో 10 వేల ఉద్యోగాలు, ఇతర విభాగాల్లో 15 వేల ఉద్యోగాల భర్తీ చేయాలని ఆమోదం తెలిపింది. ఈ ఉద్యోగాలకు నెల రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వబడుతుంది.
నెలరోజుల్లో 25వేల ఉద్యోగాల భర్తీ
"పంజాబ్ క్యాబినెట్ ఒక నెలలోపు 25,000 ఉద్యోగ ఖాళీల నోటిఫికేషన్‌ను ఆమోదించింది. ఎన్నికలకు ముందు మేము వాగ్దానం చేసినట్లుగా, మన పంజాబ్ యువతకు ఉద్యోగ అవకాశాలు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్యతగా ఉంటాయి" అని భగవంత్ మాన్ ఒక ట్వీట్‌లో తెలిపారు. శనివారం చండీగఢ్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఒక మహిళతో సహా 10 మంది ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు పంజాబ్ మంత్రివర్గంలోకి చేరారు.

మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్
పంజాబ్ రాజ్ భవన్‌లోని గురునానక్ దేవ్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ 10 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. వీరంతా పంజాబీలో ప్రమాణం చేశారు. హర్పాల్ సింగ్ చీమా, గుర్మీత్ సింగ్ మీట్ హయర్ మినహా మరో ఎనిమిది మంది తొలిసారి ఎమ్మెల్యేలు. ఈ మొదటి సారి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు జండియాలా నుండి హర్భజన్ సింగ్, మాన్సా నుండి డాక్టర్ విజయ్ సింగ్లా, భోవా నుండి లాల్ చంద్, బర్నాలా నుండి గుర్మీత్ సింగ్ మీట్ హయర్, అజ్నాలా నుండి కుల్దీప్ సింగ్ ధాలివాల్, పట్టి నుండి లాల్జిత్ సింగ్ భుల్లర్, హోషియార్‌పూర్ నుండి బ్రామ్ శంకర్ జింపా మరియు హర్జోత్ సింగ్ బైన్స్ ఆనందపూర్ సాహిబ్ లు ఉన్నారు.

పరిమిత సంఖ్యలో క్యాబినెట్ ఏర్పాటు చేసిన భగవంత్ మాన్
కేబినెట్‌లో
ముఖ్యమంత్రితో
సహా
18
మందికి
అవకాశం
ఉంది.
కానీ
భగవంత్
మాన్
పరిమిత
సంఖ్యలో
క్యాబినెట్
ఏర్పాటుకు
వెళ్లారు.
మంత్రివర్గంలో,
పార్టీ
మాల్వా
నుండి
ఐదుగురు,
మాజా
నుండి
నలుగురు
మరియు
దోబా
ప్రాంతం
నుండి
ఒకరికి
ప్రాతినిధ్యం
వహించింది.
రిజర్వ్
నియోజకవర్గాలకు
ప్రాతినిధ్యం
వహించే
దిర్బా,
జండియాలా,
మలౌట్
మరియు
భోవాలనుండి
నలుగురు
ఎమ్మెల్యేలకు
మంత్రివర్గంలో
అవకాశం
దక్కింది.
అంతేకాకుండా,
నలుగురు
జాట్
సిక్కులు
మరియు
ఇద్దరు
హిందువులకు
మంత్రివర్గంలో
స్థానం
దక్కింది.