• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download
LIVE

పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం: రైతులకు, నిరుద్యోగులకు మేలు చేసేలా చర్యలు

|
Google Oneindia TeluguNews

గత నెలలో ప్రారంభమై ఈ నెల 7వ తేదీతో ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయఢంకా మోగించగా.. పంజాబ్‌ రాష్ట్రంలో మాత్రం చతికిలపడింది. అందరి అంచనాలను పటాపంచల్ చేస్తూ అన్యూహంగా అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. ఢిల్లీ తర్వాత పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేసింది. కాంగ్రెస్ బీజేపీలకు చుక్కలు చూపిస్తూ భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ పంజాబ్‌ను కైవసం చేసుకుంది.

ఇక పంజాబ్‌లో చరిత్ర తిరగరాస్తూ తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మార్చి 16వ తేదీన స్వాతంత్ర్య సమరయోధులు భగత్‌సింగ్ జన్మించిన ఖట్కర్ కలాన్ గ్రామంలో మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ భగవంత్ మాన్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. పంజాబ్ కాబోయే సీఎం భగవంత్ మాన్‌ ప్రమాణ స్వీకారంకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్

Bhagwant Mann to swear in as Punjab CM live updates in Telugu.

Newest First Oldest First
3:21 PM, 16 Mar
పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భగవంత్ మాన్‌కి అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ. పంజాబ్ అభివృద్ధి, రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమం కోసం క‌లిసి ప‌నిచేద్ధామ‌ని చెప్పారు.
1:55 PM, 16 Mar
నిరుద్యోగ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాం : పంజాబ్ సీఎం భగవంత్ మాన్
1:54 PM, 16 Mar
చండీగ‌ఢ్‌లోని రాజ్‌భ‌వ‌న్‌లో శ‌నివారం భ‌గ‌వంత్ మాన్ మంత్రివ‌ర్గం ప్ర‌మాణ స్వీకారం
1:44 PM, 16 Mar
నాకు సీఎంగా అవకాశం ఇచ్చిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ధన్యవాదాలు : సీఎం భగవంత్ మాన్
1:43 PM, 16 Mar
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆప్ కు ఓటు వేయని వారిని కూడా గౌరవించాలి : సీఎం భగవంత్ మాన్
1:40 PM, 16 Mar
ల్యాండ్ , మైనింగ్ మాఫియా చెక్ పెడతాం : సీఎం భగవంత్ మాన్
1:38 PM, 16 Mar
పంజాబ్ లో విద్యా, వైద్య రంగంలో సమూల మార్పులు తెస్తాం : సీఎం భగవంత్ మాన్
1:37 PM, 16 Mar
ప్రజల మనోభావాలను అనుగుణంగా ఆప్ పాలన : సీఎం భగవంత్ మాన్
1:30 PM, 16 Mar
పంజాబ్ 17వ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్
1:29 PM, 16 Mar
పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ చేత ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్
1:26 PM, 16 Mar
పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన భగవంత్ మాన్
1:22 PM, 16 Mar
భగవంత్ మాన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా
1:20 PM, 16 Mar
భగవంత్ మాన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
1:19 PM, 16 Mar
కాసేపట్లో భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం
1:08 PM, 16 Mar
భగవంత్ మాన్ ప్రమాణస్వీకారోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత. దాదాపు 10వేల మంది పోలీసులతో సెక్యూరిటీ
1:01 PM, 16 Mar
పురుషులు పసుపురంగు పగిడీలు, మహిళలు పసుపు రంగు చున్నీలు ధరించి భగవంత్ మాన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు
12:50 PM, 16 Mar
పసుపు మయంగా మారిన ఖట్కర్ కలాన్ ప్రాంగణం
12:34 PM, 16 Mar
పంజ‌బ్‌ను సంప‌న్న రాష్ట్రంగా మార్చ‌డానికి దేవుడి ఆప్‌కు ధైర్యాన్ని ఇవ్వాల‌ని ప్రార్థిస్తున్నా : గురుదాస్ మాన్
12:31 PM, 16 Mar
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన గాయకుడు గురుదాస్ మాన్
12:14 PM, 16 Mar
ప్రమాణ స్వీకారానికి హాజరైన బేబీ భగవంత్ మాన్
12:11 PM, 16 Mar
19న మాన్ కేబినెట్ నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం
12:05 PM, 16 Mar
కేంద్ర మంత్రులకు, జాతీయ నేతలకు లేని ఆహ్వానాలు
11:58 AM, 16 Mar
భారీ గెలుపు జోష్ పాలనలోనూ కంటిన్యూ చేస్తారా
11:53 AM, 16 Mar
ప్రమాణ స్వీకారానికి భారీగా తరలి వస్తున్న ఆప్ కార్యకర్తలు, అభిమానులు
11:42 AM, 16 Mar
చరణ్‌జిత్ చన్నీ తమ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన ప్రమాణ స్వీకారానికి తనను ఆహ్వానించని విషయాన్ని ప్రస్తావించిన మనీష్ తివారీ
11:36 AM, 16 Mar
కొత్త సీఎంకు కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అభినందనలు. పార్లమెంట్ కారణంగా ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోతన్నానని వర్తమానం.
11:32 AM, 16 Mar
మేనిఫెస్టో అమలు పై తొలి ప్రసంగం. కేజ్రీవాల్ సమక్షంలో ప్రకటనలు.
10:57 AM, 16 Mar
పంజాబ్
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న భగవంత్ మాన్‌‌ను అభినందించిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. పంజాబ్ చరిత్రలో నిలిచిపోయే రోజుగా అభివర్ణన. పంజాబీయుల సహకారంతో సరికొత్త రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామంటూ భరోసా.
10:49 AM, 16 Mar
పంజాబ్
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న భగవంత్ మాన్‌కు అభినందనలు తెలిపిన డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
10:41 AM, 16 Mar
పంజాబ్
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న భగవంత్ మాన్‌కు అభినందనలు తెలిపిన సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్
READ MORE

English summary
Bhagwant Mann to swear in as Punjab CM live updates in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X