వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bharat Bandh :దక్షిణాది రాష్ట్రాల్లో కనిపించని బంద్ ఎఫెక్ట్

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి నిరసనగా ప్రజాసంఘాల పిలుపుమేరకు ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ఉదయం నుంచే పలు రాష్ట్రాల్లో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా కేంద్రం రైల్వేస్టేషన్ల వద్ద అదనపు భద్రత కల్పిస్తోంది.

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఇవాళ ప్రజాసంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఇప్పటికే విపక్ష పార్టీలు అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనల్లో పాలుపంచుంటున్న నేపథ్యంలో ఇవాళ భారత్ బంద్ లోనూ పాల్గొంటున్నాయి. భారత్‌ బంద్‌కు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Bharat Bandh against agnipath scheme live updates in telugu: effect seen in northern states

Newest First Oldest First
5:43 PM, 20 Jun

అగ్నిపథ్ పథకం దేశనిర్మాణంలో ఉపయోగపడుతుంది: ప్రధాని మోదీ
5:42 PM, 20 Jun

కొన్ని నిర్ణయాలు చేదుగా ఉంటాయి.. కానీ ఎంతో మందికి మేలు చేస్తాయి: ప్రధాని మోదీ
2:56 PM, 20 Jun
ఉత్తరాఖండ్

అగ్నిపథ్ నియామకాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలను నిర్వహిస్తోన్న వారిపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఘాటు వ్యాఖ్యలు. దేశానికి శతృవులంటూ మండిపడ్డ సీఎం. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శలు.
2:37 PM, 20 Jun
ఆంధ్రప్రదేశ్

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా భారత్ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో విజయవాడ జంక్షన్ రైల్వేస్టేషన్‌లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న పోలీసులు. ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు.
2:09 PM, 20 Jun
పంజాబ్

భారత్ బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జలంధర్ రైల్వే స్టేషన్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేకంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రప్పించినట్లు తెలిపిన డీసీపీ జగ్మోహన్ సింగ్
2:01 PM, 20 Jun
ఢిల్లీ

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్మీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు.
1:55 PM, 20 Jun

సోమవారం రోజున 529 రైళ్లు రద్దు
1:54 PM, 20 Jun

దక్షిణాది రాష్ట్రాల్లో కనిపించని బంద్ ఎఫెక్ట్
1:54 PM, 20 Jun

ఉత్తరాది రాష్ట్రాల్లో కొనసాగుతున్న భారత్ బంద్

English summary
bharat bandh against agnipath scheme live updates in telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X