జియోపై దిగ్గజాల కౌంటర్ అటాక్?.. డేటా రేట్ల కోత దిశగా అడుగులు??
రిలయన్స్ జియో కొత్త ఆఫర్.. ఇతర దిగ్గజ కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజాగా జియో ప్రైమ్ మెంబర్ షిప్ ప్లాన్ ప్రకటనతో ఈ కంపెనీలు కూడా డేటా ఛార్జీలను మరింత తగ్గించేందుకు సిద్ధమవుతున్నాయి.
కోల్ కతా: దాదాపు దశాబ్దం తరువాత టెలికాం పరిశ్రమలోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియో దిగ్గజాలను ఓ కుదుపు కుదిపేస్తోంది. తాజాగా జియో టారిఫ్ ప్లాన్స్ అమల్లోకి వస్తాయని ప్రకటించినప్పటికీ, ప్రైమ్ మెంబర్ షిప్ పేరుతో మరో బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.
దీంతో మిగిలిన టెలికాం కంపెనీలు కూడా తమ హై-ఎండ్ కస్టమర్లను పోగొట్టుకోకుండా ఉండేందుకు.. జియోకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారతీ ఎయిర్ టెల్, ఒడాఫోన్, ఐడియా సెల్యులార్ తక్షణమే డేటా రేట్ల కోతకు చర్యలు తీసుకోపోబోతున్నట్లు ఇండస్ట్రీ విశ్లేషకులు చెబుతున్నారు.
రూ.99 ప్రైమ్ మెంబర్ షిప్ ఫీజుతో పాటు నెలకు మరో రూ.303 చెల్లిస్తే ప్రస్తుతం హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ కింద పొందుతున్న ఉచిత డేటా, ఉచిత కాలింగ్ వంటి అన్ని ప్రయోజనాలను మరో ఏడాదిపాటు పొందవచ్చని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మంగళవారం ప్రకటించారు.

తన తాజా ప్రకటన ద్వారా ఎయిర్ టెల్, ఒడాఫోన్, ఐడియా సెల్యులార్ హై-ఎండ్ కస్టమర్లుగా ఉంటూ ఇప్పటికే జియోను రెండో సిమ్ గా వాడుతున్న వారిని ముఖేష్ అంబానీ టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తమ హై-ఎండ్ కస్టమర్లను కోల్పోకుండా ఉండేందుకు అయా టెలికాం కంపెనీలు కూడా సిద్ధమయ్యాయి. ఈ కంపెనీలకు 60 శాతానికిపైగా రెవెన్యూ ఈ హై-ఎండ్ కస్టమర్ల ద్వారానే లభిస్తుంది.
ప్రస్తుతం అమలులో ఉన్న డేటా ఛార్జీలు
ఎయిర్ టెల్ : రూ.345కు అన్ లిమిటెడ్ కాలింగ్, 28 రోజులపాటు 1జీబీ 4జీ డేటా.. రూ.1495కు 90 రోజులపాటు 35 జీబీ డేటా
ఒడాఫోన్ : రూ.349కు అన్ లిమిటెడ్ కాలింగ్, 50 ఎంబీ 3జీ కస్టమర్లకు, 4జీ కస్టమర్లకు 1జీబీ డేటా.. రూ.1500కు 30 రోజులపాటు 35 జీబీ డేటా
ఐడియా: రూ.348కు అన్ లిమిటెడ్ కాలింగ్, 4జీ హ్యాండ్ సెట్లకు 28 రోజులపాటు 1జీబీ 4జీ/3జీ డేటా.. 4జీ హ్యాండ్ సెట్లకు అప్ గ్రేడ్ అయ్యేవారికి 4జీబీ 4జీ/3జీ డేటా
బీఎస్ఎన్ఎల్: రూ.339కు అన్ లిమిటెడ్ కాలింగ్, 28 రోజులపాటు 1జీబీ డేటా
ఈ టారిఫ్ ప్లాన్స్ అన్నిటికీ ఝలక్ ఇస్తూ.. జియో రూ.303కే నెలంతా అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 1 జీబీ డేటాను అందించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం ప్రస్తుత కస్టమర్లకు మాత్రమే. 2018 మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో మిగిలిన టెలికాం కంపెనీలు కూడా తమ డేటా ఛార్జీలను మరింత తగ్గించే యోచనలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications