ఐసీసీ ఛైర్మన్‌గా పారిశ్రామిక దిగ్గజం సునీల్ మిట్టల్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) ఛైర్మన్‌గా భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సునీల్ మిట్టల్ ఎన్నికయ్యారు. దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన ఐసీసీకి ఛైర్మన్‌గా ఎన్నికైన మూడో భారతీయుడు మిట్టల్ కావడం విశేషం.
ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఛైర్మన్ టెర్రీ మెక్‌గ్రామ్ నుంచి మిట్టల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక నుంచి టెర్రీ ఐసీసీ గౌరవ ఛైర్మన్‌గా ఉంటారు.

ఈ సందర్భంగా మిట్టల్ మాట్లాడుతూ.. ప్రతిష్ఠాత్మక బిజినెస్ ఆర్గనైజేషన్‌కు ఛైర్మన్‌గా పనిచేసే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నన్నట్లు తెలిపారు. ఐసిసి ప్రపంచ వాణిజ్య అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. అగ్రికల్చరల్, కమోడిటీస్ మార్కెట్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
51వ ఛైర్మన్‌గా మిట్టల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, ఐసిసికి 130 దేశాల్లో 6.5మిలియన్ల సభ్యులున్నారు. మిట్టల్ ప్రస్తుతం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ టెలికమ్యూనికేషన్ స్టీరింగ్ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్-అమెరికా, భారత్-యూకే, భారత్-జపాన్ సీఈవో ఫోరమ్‌లలోనూ మిట్టల్ సభ్యుడిగా ఉన్నారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications