వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలో ఘర్షణలు: ఆరెస్సెస్-బీజేపీపై రాహుల్ గాంధీ నిప్పులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కుల ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంపై కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. బీజేపీ, ఆరెస్సెస్‌లపై విరుచుకుపడ్డారు.

వీధులెక్కిన దళితులు, ఉద్రిక్తత: ముంబైలో స్కూల్స్ మూత వీధులెక్కిన దళితులు, ఉద్రిక్తత: ముంబైలో స్కూల్స్ మూత

భారతీయ సమాజంలో దళితులు అట్టడుగున ఉండాలన్నదే భారతదేశం పట్ల ఆరెస్సెస్/బీజేపీల ఫాసిస్ట్ విజన్‌ మూలస్తంభమని విమర్శించారు. ఉణ, రోహిత్ వేముల, ఇప్పుడు భీమా-కొరెగావ్ ప్రతిఘటనకు శక్తిమంతమైన సంకేతాలు అన్నారు.

Bhima Koregaon symbol of Dalit resistance, BJP-RSS have fascist vision for India, tweets Rahul Gandhi

పుణేలో సోమవారం చోటుచేసుకున్న కుల ఘర్షణలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత వర్గాలు మంగళవారం చేపట్టిన ముంబై బంద్ హింసాత్మకంగా మారింది.

భీమా కొరేగావ్ పోరాటానికి 200 ఏళ్లు అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు సోమవారం లక్షల మంది దళితులు హాజరయ్యారు. ఈ సమయంలో దళిత, మరాఠా వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఒక వ్యక్తి మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.

English summary
'A central pillar of the RSS/BJP’s fascist vision for India is that Dalits should remain at the bottom of Indian society. Una, Rohith Vemula and now Bhima-Koregaon are potent symbols of the resistance.' Rahul Gandhi tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X