ఎయిర్ ఇండియా విమానంలో పొగలు.. అత్యవసరంగా ల్యాండింగ్... తీరా చూస్తే..
189 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం రాయ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయ్యింది. విమానంలో పొగలు రావడంతో ల్యాండ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా విమానం భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
విమానంలోని ఎడమ ఇంజిన్‌లో పొగ వచ్చినట్టు పైలట్ గుర్తించారు. వెంటనే ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో సాయంత్రం 6 గంటలకు ల్యాండ్ చేసినట్టు వివరించారు. ఈ విషయాన్ని రాయ్‌పూర్ విమానాశ్రయ డైరెక్టర్ రాకేశ్ సాహయ్ ధ్రువీకరించారు.

ఎయిర్ ఇండియా ఏఐసీ 670 విమానం సాయంత్రం 5.06 గంటలకు భువనేశ్వర్ నుంచి బయల్దేరింది. కాసేపటికే ఇంజిన్‌లో పొగలను పైలట్ గుర్తించారు. వెంటనే ఏటీసీకి సమాచారం అందించి.. రాయ్‌పూర్‌ో దింపేశారు. విమానం దిగాక అగ్నిమాపక సిబ్బంది ఇంజిన్‌ను పరిశీలించారు. అధికారులు పరిశీలించి పొగలు రాలేదని గుర్తించారు. అయితే సాంకేతిక సమస్య వల్ల పొగ వచ్చినట్టు కనిపించి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. దీంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. ప్రయాణికులను టర్మినల్ బిల్డింగ్‌కు పంపించినట్టు తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications