బిగ్ బాస్.. తీహార్ క్లబ్‌కు స్వాగతం: కేజ్రీవాల్‌కు సుకేష్ చంద్రశేఖర్ షాకింగ్ లేఖ!!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ అరెస్టు జరిగింది. ప్రస్తుతం ఆయన ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. నిన్న కేజ్రీవాల్ ను కోర్టులో హాజరు పరిచిన క్రమంలో మార్చి 28 వరకు కోర్టు ఆయనను ఈడీ కస్టడీకి అనుమతించిన తర్వాత, నేడు మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశారు.

మొన్నటికి మొన్న కవిత అరెస్టు తర్వాత అక్క వెల్కమ్ అంటూ .. కవితకు లేఖ రాసిన సుకేష్ చంద్రశేఖర్, తాజాగా బిగ్ బాస్ వెల్కమ్ అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని టార్గెట్ చేశారు. తాను రాసిన సంచలన లేఖలో సుకేష్ చంద్రశేఖర్ కేజ్రీవాల్ మోసగాడని, సత్యం ఎప్పటికైనా గెలుస్తుందని, చట్టానికి ఎవరూ అతీతులు కారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం అని వ్యాఖ్యలు చేశారు.

Big Boss Welcome to Tihar Club Sukesh Chandrasekhar sensational letter on kejriwal arrest

తీహార్ క్లబ్ కు బిగ్ బాస్ మిమ్మల్ని స్వాగతిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. మీ డ్రామాలు చివరి దశకు చేరుకున్నాయని పేర్కొన్న సుకేష్, ఇక ఎంత నటించినా తప్పించుకోలేరని తన లేఖలో పేర్కొన్నారు. అంతే కాదు తన పుట్టినరోజు మార్చి 25వ తేదీన జరుపుకోబోతున్నానని, అయితే కేజ్రీవాల్ రాకతో మూడు రోజులు ముందే తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లుగా ఉందని తెలిపాడు.

తీహార్ జైలును నడపడానికి ముగ్గురు సోదరులు ఇక్కడికి వచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకరు చైర్మన్ బిగ్ బాస్ అరవింద్ కేజ్రీవాల్ కాగా, సీఈవోగా మనీష్ సిసోడియా, సీఓ ఓ గా సత్యేంద్ర జైన్ ఉన్నారని సుకేష్ తన లేఖలో పేర్కొన్నారు. బ్రదర్ కేజ్రీవాల్.. మీ అవినీతి అంతా త్వరలో బయటపడబోతుందని పేర్కొన్న సుకేష్, సీఎం హోదాలో ఎన్నో స్కాములు చేశారని లేఖలో తెలిపారు.

స్కాము లతో పేద ప్రజలను దోచుకున్నారని అరవింద్ కేజ్రీవాల్ ని టార్గెట్ చేసి సుకేష్ చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. ఇక మీ మోసాలను, మీ అవినీతి చట్టాను బయటపెడతానని సుకేష్ చంద్రశేఖర్ తన లేఖలో పేర్కొన్నారు. కవిత అరెస్టు తర్వాత ఆమెకు లేఖ రాసినప్పుడే నెక్స్ట్ అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో అరెస్ట్ అవ్వాలని, అవుతారని సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సుకేష్ చెప్పినట్టు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కూడా జరిగిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+