Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యోగీ గోరఖ్ పూర్ కు మహర్దశ-4 వేల కోట్లతో టౌన్ షిప్పులు, మెడిసిటీ వంటి 172 ప్రాజెక్టులు ప్రారంభం..

ఉత్తర్ ప్రదేశ్ లో వరుసగా ఆరేళ్ల పాలన పూర్తి చేసుకున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. తన సొంత నియోజకవర్గం గోరఖ్ పూర్ కు మహర్దశ పట్టించాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. గోరఖ్ పూర్ నియోజకవర్గంలో భవిష్యత్ సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇందులో భాగంగా భారీ ప్రాజెక్టుల్ని యోగీ ప్రారంభించారు.

గోరఖ్‌పూర్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ.3,838 కోట్ల విలువైన 172 ప్రాజెక్టులను తాజాగా ప్రారంభించారు. ఇందులో ప్రపంచస్ధాయి సౌకర్యాలు కలిగిన ఖోరాబర్ టౌన్‌షిప్, మెడిసిటీ ప్రాజెక్టులు ఉన్నాయి. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌ను త్వరలో విమానాశ్రయం తరహాలో సరైన విశ్రాంతి, వేచి ఉండే ప్రదేశాలు, ఇతర సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు యోగీ ప్రకటించారు. అప్‌గ్రేడ్ చేసిన రైల్వే స్టేషన్‌లోని అన్ని సౌకర్యాలు విశ్రాంతి, వేచి ఉండే ప్రాంతాలు, క్యాంటీన్‌తో సహా విమానాశ్రయం లా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

big infra push to yogi adityanaths gorakhpur including hotels, townships and medicity projects

దళారుల బారిన పడవద్దని, కొత్త టౌన్‌షిప్ రిజిస్ట్రేషన్ కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవాలని ప్రజలను సీఎం యోగీ ఆదిత్యనాథ్ కోరారు. రోడ్ల విస్తరణ, నగరానికి నలువైపులా నాలుగు లేన్ల కనెక్టివిటీ, నగరాన్ని కలిపే ఆరు లేన్ల రహదారి, రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులతో కొత్త గోరఖ్‌పూర్ రూపుదిద్దుకుంటోందన్నారు. ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా గోరఖ్‌పూర్‌లో కోట్లాది రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని పేర్కొన్న ఆదిత్యనాథ్, నగరంలో త్వరలో కొత్త హోటళ్లు, ఆసుపత్రులు, పరిశ్రమలు, కొత్త టౌన్‌షిప్‌లు రాబోతున్నట్లు తెలిపారు.

ఈ పెట్టుబడులతో యువతకు ఉపాధి అవకాశాలు కూడా వస్తాయన్నారు. యువత స్థానికంగా ఉపాధి పొందినప్పుడు, వారు సంపాదించిన డబ్బు గోరఖ్‌పూర్‌లోనే ఉపయోగించబడుతుందన్నారు. అలాగే తూర్పు యూపీ ప్రాంతంలో కొత్త యూనివర్సిటీలు రానున్నాయని ముఖ్యమంత్రి యోగీ తెలిపారు. పొరుగున ఉన్న ఖుషినగర్ జిల్లాలో త్వరలో బుద్ధ భగవానుడి పేరు మీద వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా రానుందన్నారు. కోట్లాది రూపాయల విలువైన కొత్త ప్రాజెక్టులు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాస్తవ పరిస్ధితికి అద్దం పడుతున్నాయని యోగీ అభివర్ణించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+