వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేఘాలయలో కాంగ్రెస్ కు మమత జలక్ - టీఎంసీలోకి 12 మంది ఎమ్మెల్యేల జంప్ : చక్రం తిప్పిన పీకే..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

తృణమూల్‌ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ దిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీతో ఆమె సమావేశమయ్యారు. ఆ సమయంలోనే ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. చేరిన వారిలో మాజీ ముఖ్యమంత్రి ముకుల్‌ సంగ్మా సైతం ఉన్నారు. మొత్తం 60 సీట్లు ఉన్న అసెంబ్లీకీ 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. తాజాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల చేరికతో రాత్రికే రాత్రే తృణమూల్‌ ప్రధాన ప్రతిపక్షపార్టీగా అవతరించింది.

ఇతర రాష్ట్రాల్లో విస్తరించే దిశగా

ఇతర రాష్ట్రాల్లో విస్తరించే దిశగా

దీంతో 2023లో రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో టీఎంసీ బలమైన పోటీఇచ్చే అవకాశం ఉంది. తృణమూల్‌లో చేరడంపై అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాసినట్లు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. గతకొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీపై ముకుల్‌ సంగ్మా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన తన అనునూయులతో కలిసి తృణమూల్‌లో చేరినట్లు తెలుస్తోంది. వరుసుగా మూడోసారి బెంగాల్‌లో అధికారాన్ని చేజిక్కించుకుని ఈశాన్య రాష్ట్రాల్లో తన బలం పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్న తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ వ్యూహంలో భాగంగానే ఈ పరిణామం చోటు చేసుకున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

తెర వెనుక ప్రశాంత్ కిషోర్ కీ రోల్

తెర వెనుక ప్రశాంత్ కిషోర్ కీ రోల్

ఎన్నికల వ్యూహకర్త, మమతా బెనర్జీకి సన్నిహితుడైన ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన బృందం కొంతకాలంగా షిల్లాంగ్‌లో మకాం వేసి క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై సర్వే చేస్తోంది. ఇప్పుడు ముకుల్‌ సంగ్మా చేరికతో టీఎంసీ ఒక్కసారిగా బలపడినట్లైంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న మమతా కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని మీరు కలవనున్నారా' అని విలేకరులు అడగడంతో లేదని బదులిచ్చారు. దిల్లీకి వచ్చిన ప్రతిసారీ మేము సోనియా గాంధీని కలవాల్సిన అవసరం లేదని మమతా చెప్పారు.

మేఘాలయకు రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి

మేఘాలయకు రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి

ఎమ్మెల్యేలు పార్టీ మారారని వస్తున్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి మనీష్‌ ఛత్రత్‌ ఈ రోజు మేఘాలయ వెళ్లనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ దివంగత నేత అహ్మద్‌ పటేల్‌ మొదటి వర్ధంతి సందర్భంగా గురువారం ఆయన గుజరాత్‌ వెళ్లాల్సి ఉండగా, తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. గత కొద్దినెలలుగా పలు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే పనిలో ఉన్న టీఎంసీ పలువురు కీలక నాయకులను పార్టీలో చేర్చుకుంటోంది.

Recommended Video

Puneet Bisht Created A New World Record After Smashing 17 Sixes In T20 Match|Syed Mushtaq Ali Trophy
సోనియాతో భేటీకి దీదీ నో..వ్యూహాత్మక అడుగులు

సోనియాతో భేటీకి దీదీ నో..వ్యూహాత్మక అడుగులు

రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌ నేతలు కీర్తి ఆజాద్‌, రాహుల్‌ గాంధీకి ఒకప్పుడు సన్నిహితుడైన అశోక్‌ తన్వర్‌లు మమతా బెనర్జీ సమక్షంలో ఆపార్టీలో చేరారు. గత సెప్టెంబర్‌లో గోవా మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ బలమైన నేత లుజినో ఫలైరో తృణమూల్‌లో చేరారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు కూడా టీఎంసీలో చేరారు. వచ్చే ఏడాది గోవాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ తమ బలాన్ని పెంచే దిశగా మమత బెనర్జీ అడుగులు వేస్తున్నారు. గోవాలో గెలుపే లక్ష్యంగా మమతా పావులు కదుపుతున్నారు.


English summary
Former Meghalaya Chief Minister Mukul Sangma and 11 others joined Trinamool Congress in Meghalaya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X