వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీగా తగ్గిన కరోనా కేసులు ; కరోనా థర్డ్ వేవ్ పై ఎయిమ్స్ డైరెక్టర్ ప్రకటనతోనూ భారత్ కు బిగ్ రిలీఫ్

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. దేశంలో కరోనా రెండో దశ ప్రారంభం అయినప్పటి నుండి మొదటిసారిగా 25 వేలకు కేసులు తగ్గాయి. ఇది భారత్ కు ఊరట కలిగించే అంశం. ఇదిలా ఉంటే భారతదేశం గత 24 గంటల్లో మొత్తం 25,166 కొత్త కరోనావైరస్ కేసులను నమోదు చేసింది. ఇదే సమయంలో 437 మరణాలను భారత్ నివేదించింది. ఇది మార్చి 16 తర్వాత అత్యల్పంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా మంగళవారం తెలిపింది. ప్రస్తుతం కేసులు తగ్గుతున్న తీరు భారత్ కు బిగ్ రిలీఫ్ అని చెప్పాలి.

Recommended Video

Corona Virus India : ఓ వైపు వ్యాక్సినేషన్.. మరోవైపు తగ్గని ఉధృతి || Oneindia Telugu

కరోనా విలయ తాండవం : 142 దేశాల్లో డెల్టా కేసులు, డేంజర్ లిస్ట్ లో భారత్ : డబ్ల్యూహెచ్ఓకరోనా విలయ తాండవం : 142 దేశాల్లో డెల్టా కేసులు, డేంజర్ లిస్ట్ లో భారత్ : డబ్ల్యూహెచ్ఓ

 దేశంలో బాగా తగ్గిన క్రియాశీల కేసులు

దేశంలో బాగా తగ్గిన క్రియాశీల కేసులు

దేశం యొక్క క్రియాశీల కేసుల సంఖ్య 3,69,846 కి తగ్గింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం రికవరీలు దేశవ్యాప్తంగా 3,14,48,754 వద్ద ఉన్నాయి. గత 24 గంటల్లో, యాక్టివ్ కేసులు 12,101 తగ్గాయి. గత 24 గంటల్లో 15,63,985 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 25,166 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం దేశంలో మొత్తం కేసులు 3.22 కోట్లకు చేరుకున్నాయి.

 కేరళలో అత్యధికంగా రోజువారీ కేసులు .. నిన్న 12,294 కేసులు

కేరళలో అత్యధికంగా రోజువారీ కేసులు .. నిన్న 12,294 కేసులు

కరోనా కేసులు నమోదులో గత 24 గంటల్లో వివిధ రాష్ట్రాల్లో పరిస్థితిని చూస్తే కేరళలో అత్యధికంగా 12,294 కేసులు నమోదయ్యాయి, తరువాత మహారాష్ట్రలో 4,145 కేసులు, తమిళనాడులో 1,851 కేసులు, కర్ణాటకలో 1,065 కేసులు మరియు ఆంధ్రప్రదేశ్‌లో 909 కేసులు నమోదయ్యాయి. దేశంలోని మొత్తం కొత్త కేసుల్లో 80.52 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుంచి నమోదయ్యాయి. ఒక్క కేరళ మాత్రమే 48.85 శాతం కేసులను నమోదు చేసింది. ఇక దేశంలో అత్యధికంగా కేసులు నమోదు చేస్తున్న టాప్ ఫైవ్ రాష్ట్రాలలో దక్షిణాది రాష్ట్రాలే ఉండటం గమనార్హం.

భారత్ లో రికవరీ రేటు 97.51 శాతం

భారత్ లో రికవరీ రేటు 97.51 శాతం

మంగళవారం నివేదించిన కరోనా డేటా ప్రకారం కేరళలో అత్యధికంగా 142 మంది మరణించగా, మహారాష్ట్ర తరువాత 100 తాజా మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో మొత్తం 36,830 మంది రోగులు కోలుకున్నారు, భారతదేశంలో రికవరీ రేటు 97.51 శాతంగా ఉంది.సోమవారం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద మొత్తం 88,13,919 డోసులు ఇవ్వబడ్డాయి. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య 55,47,30,609 కి చేరింది. తాజాగా మృతి చెందిన 437 మంది తో కలిపి ఇప్పటి వరకు భారత దేశంలో మొత్తం కరోనా మరణాలు 4,32 ,079 గా నమోదయ్యాయి.

భారత్ లో కరోనా థర్డ్ వేవ్ పై ఎయిమ్స్ డైరెక్టర్ ప్రకటనతో బిగ్ రిలీఫ్

భారత్ లో కరోనా థర్డ్ వేవ్ పై ఎయిమ్స్ డైరెక్టర్ ప్రకటనతో బిగ్ రిలీఫ్

ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఊపిరి పీల్చుకునే వార్తను చెప్పారు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) డైరెక్టర్ రణదీప్ గులేరియా. భారతదేశం కరోనా వైరస్ యొక్క మూడవ తరంగాన్ని చూడకపోవచ్చు కానీ అది ఎక్కువగా కోవిడ్ నిబంధనలను అనుసరించే వ్యక్తులపై ఆధారపడి ఉంటుందని నొక్కి చెప్పారు. రెండవ తరంగం వలె అత్యంత దారుణ పరిస్థితులు ఉండే మూడవ తరంగాన్ని మనం చూస్తామని తాను అనుకోనని ప్రఖ్యాత పల్మనాలజిస్ట్ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. తాజాగా కరోనా మహమ్మారి కేసులు తగ్గుతున్న తీరు, ఇదే సమయంలో కరోనా థర్డ్ వేవ్ పై రణదీప్ గులేరియా చేసిన ప్రకటన కూడా దేశానికి ఉపశమనం కలిగించిందని చెప్పాలి.

English summary
India,registered a total of 25,166 new coronavirus cases in the last 24 hours. India reported 437 deaths during the same period.The declining number of cases at present is a big relief to India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X