వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గల్ఫ్ లాటరీలో జాక్‌పాట్.. అకౌంటెంట్‌కు 23 కోట్లు.. హ్యాపీగా ఉందంటూ..!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : కాలం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడనే చందంగా ఓ యువకుడి కల నెరవేరనుంది. ఏనాటికైనా కోటీశ్వరుడిగా ఎదగాలని కలలు కంటున్న సదరు యువకుడు గల్ఫ్ లాటరీలో జాక్‌పాట్ కొట్టాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 23 కోట్ల రూపాయలు సొంతం చేసుకోనున్నాడు. అకౌంటెంట్‌గా జీవన పోరాటం చేస్తున్న సదరు యువకుడికి ఈ జాక్‌పాట్ తగలడంతో ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ప్రతి నెలా మూడో తేదీన అబుదాబి ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో తీసే లక్కీ లాటరీలో 12 మిలియన్ల దిర్హామ్స్ ఈసారి సదరు యువకుడి ఖాతాలో చేరనున్నాయి.

అకౌంటెంట్‌కు బిగ్ టికెట్ జాక్‌పాట్.. 23 కోట్లు సొంతం..!

అకౌంటెంట్‌కు బిగ్ టికెట్ జాక్‌పాట్.. 23 కోట్లు సొంతం..!

కర్ణాటకకు చెందిన 24 సంవత్సరాల మహ్మద్ ఫయాజ్ ముంబైలో అకౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. స్నేహితుడితో కలిసి అక్కడే నివాసముంటున్న ఫయాజ్‌కు అబుదాబి బిగ్ టికెట్ లాటరీకి సంబంధించి అవగాహన ఉంది. ఆ క్రమంలో గత ఆరు నెలలుగా టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో ఈ లాటరీ తనకు ఎప్పుడైనా తగలక పోతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఈ జాక్‌పాట్ తగలడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

5 రోజుల ముందే దసరా పండుగ.. అడవి తల్లి ఒడిలో ప్రత్యేక పూజలు5 రోజుల ముందే దసరా పండుగ.. అడవి తల్లి ఒడిలో ప్రత్యేక పూజలు

ఏనాటికైనా కోటీశ్వరుడిగా.. లక్కీగా కలిసొచ్చిన లాటరీ

ఏనాటికైనా కోటీశ్వరుడిగా.. లక్కీగా కలిసొచ్చిన లాటరీ

కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే కావడం.. తల్లిదండ్రులు అనారోగ్యం బారిన చనిపోవడంతో ఫయాజ్ ముంబైకి చేరుకున్నారు. అకౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. చిన్నప్పటి నుంచి కుటుంబ ఆర్థిక పరిస్థితులు గమనిస్తున్న ఫయాజ్‌కు ఏనాటికైనా కోటీశ్వరుడు కావాలన్నది కోరికలా మారింది. దాంతో అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతి నెలా నిర్వహించే బిగ్ టికెట్ లాటరీ గురించి తెలిసి గత ఆరు నెలలుగా టికెట్లు కొంటున్నారు. అయితే అక్టోబర్ 3వ తేదీ రాత్రి తీసిన డ్రా లో అతడికి జాక్‌పాట్ తగిలింది. దాంతో దాదాపు 23 కోట్ల రూపాయలు ఆయన సొంతం కానున్నాయి.

కొంత మేర సామాజిక సేవకు వినియోగిస్తానంటున్న ఫయాజ్

కొంత మేర సామాజిక సేవకు వినియోగిస్తానంటున్న ఫయాజ్

బిగ్ టికెట్ లాటరీ తనకు తగిలిందని నిర్వాహకులు ఫోన్ చేసినప్పుడు మొదట నమ్మలేదని.. ఆ సంస్థకు చెందిన వెబ్‌సైట్‌లో తన పేరు చూసుకున్నాక అది నిజమేనని ధృవీకరించుకున్నట్లు చెప్పారు ఫయాజ్. ఈ లాటరీ నగదు తన చేతికి అందాక మధ్యలో ఆగిపోయిన ఇంటి నిర్మాణం పూర్తి చేశానని చెప్పుకొచ్చారు. అందులో కొంత మేర సామాజిక సేవకు వినియోగిస్తానని స్పష్టం చేశారు. అయితే లాటరీ తగిలిన ఆనందంలో ఉన్న ఫయాజ్.. ఇంతవరకు తానెప్పుడూ గల్ఫ్ దేశాలకు వెళ్లలేదని తెలిపారు. బిగ్ టికెట్ లాటరీ తనను వరించడంతో ఆ చెక్కును తీసుకోవడానికి వచ్చే నెల అక్కడకు వెళుతున్నట్లు చెప్పారు.

English summary
In a rare instance, an Indian man who never visited the UAE, won Dh12 million in the Big Ticket raffle draw held at Abu Dhabi International Airport on Thursday evening. Mohammed Fayaz J.A., 24, hails from Karnataka state and works in India's financial city of Mumbai as an accountant. At a young age, Fayaz, his brother and two sisters had to bear the loss of both their parents. Fayaz then left for Mumbai to support his family. It's only six months since he started buying tickets along with his roommate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X