జ్యోతి మల్హోత్రా ఫోన్లు, ల్యాప్ టాప్ లో 12టెరా బైట్ల డేటా.. బిగ్ స్కెచ్.. సంచలన విషయాలు వెలుగులోకి..?
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆమెకు పాకిస్థాన్ ప్రభుత్వం, ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ హరియాణాలోని హిసార్ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే పోలీసుల విచారణలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా.. పాకిస్థాన్ కు గూఢచారిగా వ్యవహరించి అరెస్టయింది. ఆమె కేసు విచారణలో ఉంది. ఈ మేరకు హరియాణాలోని హిసార్ కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా పోలీసుల విచారణలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జ్యోతి మల్హోత్రా వాడిన గ్యాడ్జెట్స్(ఫోన్, ల్యాప్ టాప్.. తదితర పరికరాలు) లో భారీ స్థాయిలో డేటాను అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆ డేటా మొత్తం సామర్థ్యం 12 టెరా బైట్లు మేర ఉందని తెలుస్తోంది.
పోలీసుల విచారణలో భాగంగా జ్యోతి మల్హోత్రా ఫోన్లు, ల్యాప్ టాప్ లను తనిఖీ చేశారు. దీంతో ఈ గ్యాడ్జెట్స్ లో ఏకంగా 12 టెరా బైట్స్ మేర సమాచారం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమాచారాన్ని స్కాన్ చేస్తే మొత్తం సమాచారం బయటకు వస్తుందని.. పలు కీలక ఆధారాలు లభ్యం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇక జ్యోతి సీక్రెట్ గా సంభాషణలు జరిపిన వారిలో నలుగురు పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్లు ఉన్నారు. వారిలో డానిష్, అహసాన్, షాహిద్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
మరోవైపు ఆమె గతంలో పాకిస్థాన్ వెళ్లినప్పుడు అక్కడి ప్రభుత్వం జ్యోతికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పినట్లు.. రాచ మర్యాదలు చేసినట్లు తేలింది. ఆరుగురు గన్ మెన్స్ తో ఆమెకు ఫుల్ సెక్యూరిటీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏకే 47 రైఫిల్స్ తో జ్యోతి మల్హోత్రాకు భద్రత కల్పించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇక ఇప్పటికే పాకిస్థాన్ కు గూఢచర్యం చేసిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లంతా పాక్ నుంచి డబ్బు తీసుకుని ఇక్కడి రహస్య సమాచారాన్ని.. పోలీసులు, అధికారుల కదలికలను ఎప్పటికప్పుడు పాకిస్థాన్ నిఘా వర్గాలకు చేరవేస్తున్నట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications