బైక్ లు, స్కూటీలు కొనేవారికి భారీ శుభవార్త.. రెండు హెల్మెట్లు ఫ్రీ
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనదారుడి భద్రత దృష్ట్యా ఇకపై తయారు చేసే అన్ని బైక్ లు, స్కూటీల్లో యాంటీ బ్రేకింగ్ సిస్టమ్(ABS) ను తప్పనిసరి చేసింది. ఇంజిన్ కెపాసిటీ ఎంత ఉన్నా ABS ను తప్పనిసరి చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక ప్రతి బైక్ లేదా స్కూటీ కొనుగోలుపై తయారీ సంస్థలు లేదా డీలర్లు రెండు హెల్మెట్ లు ఉచితంగా ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.
మీలో ఎవరైనా బైక్ లేదా స్కూటీ కొనేందుకు సిద్ధం అవుతున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బైక్, స్కూటీ కొనుగోలు చేసేవారికి తయరీ సంస్థలు లేదా డీలర్లు బీఐఎస్ గుర్తింపు పొందిన రెండు హెల్మెట్ లను ఉచితంగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక వచ్చే ఏడాది జనవరి తర్వాత మార్కెట్ లోకి విడుదలయ్యే ద్విచక్ర వాహనాలకు యాంటీ బ్రేకింగ్ సిస్టమ్(ABS) ను తప్పనిసరి చేసింది. ఈ విధానాల వల్ల దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించ వచ్చని కేంద్ర రోడ్డు, రవాణా సంస్థ అభిప్రాయపడింది.

ఇటీవల జరుగుతున్న అనేక రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బైక్ పై ప్రయాణించే డ్రైవర్ తోపాటు వెనకాల కూర్చున్న వ్యక్తి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు ఇటీవల వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరో భారీ శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారుల కోసం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ తీసుకురానున్నట్లు తెలిపింది. కేవలం రూ.3వేలతో ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను తీసుకుంటే ఒక సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై నిశ్చింతగా, సాఫీగా రాకపోకలు సాగించొచ్చని పేర్కొంది.












Click it and Unblock the Notifications