పెను విషాదం: చెరువులోకి దూసుకెళ్లిన బస్సు, 50మంది మృతి
పాట్నా: బీహార్ రాష్ట్రంలో సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మధుబని ప్రాంతంలో ఓ బస్సు అదుపుతప్పి రహదారికి సమీపంలోని చెరువులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 50 మంది దుర్మరణం చెందినట్లు సమాచారం.
మధుబని నుంచి సీతామర్హికి వెళ్తుండగా పాట్నాకు 180 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఓ మహిళతోపాటు నలుగురు ప్రయాణికులను బయటికి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

ప్రమాద సమయంలో బస్సులో 55మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. డ్రైవర్ అదుపుతప్పి బస్సును చెరువులోనికి తీసుకెళ్లాడని, సుమారు 25ఫీట్ల లోతులో బస్సు పడిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
బస్సులోని ప్రయాణికులను బయటికి తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన వెంటనే సమీపంలోని గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకు సహాయక చర్యలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications