వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bihar Exit Polls 2020: బీహార్‌లో అధికారం ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఎవరికి పట్టం కడుతున్నాయి..?

|
Google Oneindia TeluguNews

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం మూడు విడతలుగా జరుగుతున్న ఎన్నికల్లోరెండు దశల ఎన్నికల పోలింగ్ ముగిసింది. తొలిదశ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 28న ముగియగా రెండో దశ ఎన్నికల పోలింగ్ నవంబర్ 3వ తేదీన ముగిసింది. ఇక చివరి దశకు పోలింగ్ నవంబర్ 7న జరగనుంది. మొత్తం 15 జిల్లాల్లోని 78 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. చివరి దశ ఎన్నికల్లో మొత్తం 1207 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

తొలి రెండు దశల్లో ప్రధాన పోటీ ఎన్డీయే, మహాగట్భంధన్ మధ్య నెలకొనగా... మూడో దశ ముక్కోణపు పోటీగా మారే అవకాశాలున్నాయి. చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎల్‌జేపీ కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వనుంది. ఇక ఎన్డీయే, మహాగట్భంధన్, ఎల్‌జేపీలతో పాటు ఉపేం్ర కుష్వాహా ఆర్ఎల్‌ఎస్‌పీ, అసదుద్దీన్ మజ్లిస్ పార్టీ, మాయావతి బీఎస్పీ, రాజీవ్ రంజన్ పార్టీ జన్ అధికార్ పార్టీలు బరిలో ఉంటున్నాయి. ఇక కుల సమీకరణాల విషయానికొస్తే కోసి ప్రాంతంలో యాదవుల జనాభా ఎక్కువగా ఉంది. మూడో దశ పోలింగ్‌లో మెజార్టీ ఓటర్లు యాదవ కులానికి చెందిన వారు ఉండటం విశేషం.

Bihar Assembly Election 2020 Live Updates:78 seats to go for polling in final phase

ఇక బీహార్‌‌లో చివరి దశ పోలింగ్ విశేషాలు మినిట్-టూ-మినిట్ లైవ్‌లో మీకోసం

Newest First Oldest First
9:20 PM, 7 Nov

ఎగ్జిట్ పోల్స్ ప్రకారం సీఎం పోస్టుకు దూసుకెళుతున్న యువనేత తేజస్వీ యాదవ్
9:01 PM, 7 Nov

యువత తేజస్వీ వైపు ఉండగా...సీనియర్ సిటిజెన్స్ నితీష్ వైపు నిలిచినట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి
8:47 PM, 7 Nov

కోసి ప్రాంతంలో మహాకూటమి 23 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది
8:24 PM, 7 Nov

వయస్సు వారీగా : 18-25 ఏళ్లు: 47శాతం మహాగట్బంధన్ 34 శాతం ఎన్డీఏ 26-35 ఏళ్లు: 47శాతం మహాగట్బంధన్ 36 శాతం ఎన్డీఏ 36-50 ఏళ్లు: 41శాతం మహాగట్బంధన్ 42 శాతం ఎన్డీఏ 51-60 ఏళ్లు: 40శాతం మహాగట్బంధన్ 45 శాతం ఎన్డీఏ 61ఏళ్లు పైబడి: 38శాతం మహాగట్బంధన్ 48 శాతం ఎన్డీఏ
7:54 PM, 7 Nov

టుడేస్ చాణక్య

ఎన్డీఏకు 34శాతం మంది మద్దతు తెలపగా..మహాగట్బంధన్‌కు 44శాతం మంది మద్దతు తెలిపినట్లు టుడేస్ చాణక్య వెల్లడించింది
7:51 PM, 7 Nov

టుడేస్ చాణక్య

బీహార్‌లో మహాగట్భంధన్‌కే విజయావకాశాలు ఎక్కువని తేల్చిన టుడేస్ చాణక్య
7:31 PM, 7 Nov

టీవీ 9 భారత్ వర్ష్ సర్వే

ఎన్డీయే: 110-120 మహాగట్బంధన్ : 115-125 ఎల్‌జేపీ: 3-5 ఇతరులు: 10-15
7:29 PM, 7 Nov

ఇండియా టుడే సర్వేలో తేజస్వీ యాదవ్‌కు 44శాతం మంది మద్దతు తెలిపారు
6:55 PM, 7 Nov

ఏబీపీ సర్వే

ఏబీపీ సర్వే: ఎన్డీయే: 104-128 మహాగట్బంధన్ : 108-131 ఎల్‌జేపీ: 1-3 ఇతరులు: 4-8
6:53 PM, 7 Nov

మధ్యప్రదేశ్ ఉపఎన్నిక

మధ్యప్రదేశ్ ఉపఎన్నికలో మొత్తం 28 సీట్లలో బీజేపీకి 16 నుంచి 18 సీట్లు వస్తాయని అంచనా వేసిన ఇండియా టుడే -యాక్సిస్ మై ఇండియా సర్వే
6:51 PM, 7 Nov

మధ్యప్రదేశ్ ఉపఎన్నిక

మధ్యప్రదేశ్ ఉపఎన్నికలో మొత్తం 28 సీట్లలో బీజేపీకి 16 నుంచి 18 సీట్లు వస్తాయని అంచనా వేసిన ఇండియా టుడే -యాక్సిస్ మై ఇండియా సర్వే
6:40 PM, 7 Nov

రిపబ్లిక్ జన్‌ కీ బాత్

రిపబ్లిక్ జన్‌ కీ బాత్: ఎన్డీఏ 91-117, మహాగట్బంధన్: 118-138, ఎల్‌జేపీ5-8, ఇతరులు 3-6 సీట్లు
6:38 PM, 7 Nov

2015లో ఎన్డీయేకు 125 సీట్లు అంచనా వేసిన సీ ఓటర్ సర్వే, ఎంజీబీకి 120 సీట్లు అంచనా వేసిన టైమ్స్ నౌ సీ ఓటర్ సర్వే
6:34 PM, 7 Nov

సీఓటర్ ప్రకారం కీలకం కానున్న ఎల్జేపీ ఇతరులు
6:34 PM, 7 Nov

సీఓటర్ ప్రకారం హంగ్ వచ్చేలా కనిపిస్తోంది
6:32 PM, 7 Nov

సీఓటర్ ఎగ్జిట్ పోల్: మహాగట్బంధన్ 120 సీట్లు, ఎన్డీఏ 116, ఎల్జేపీ-1 ఇతరులు -6
6:30 PM, 7 Nov

ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక్క బీహార్‌లోనే ఇప్పటి వరకు బీజేపీ సోలోగా ఎప్పుడూ గెలవలేదు
6:11 PM, 7 Nov

బీహార్‌ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన యువత. యువత ఓటే కీలకం కానుందని అభిప్రాయపడుతున్న విశ్లేషకులు
6:08 PM, 7 Nov

నవంబర్ 10వ తేదీన బీహార్ ఎన్నికల ఫలితాలు
6:04 PM, 7 Nov

ముగిసిన బీహార్ ఎన్నికల చివరి దశ పోలింగ్. సాయంత్రం 5 గంటల సమయానికి 54.17శాతం పోలింగ్ నమోదు
5:25 PM, 7 Nov

ముజఫర్‌పూర్‌లో వృద్ధులను పోలింగ్ కేంద్రాలకు మోసుకెళుతున్న ఐటీబీపీ జవాన్లు
5:06 PM, 7 Nov

బీహార్ చివరి దశ పోలింగ్‌కు మరో గంట సమయం మాత్రమే ఉంది
2:22 PM, 7 Nov

మధ్యాహ్నం 1గంట సమయానికి బీహార్ చివరి దశ ఎన్నికల్లో 34.82శాతం పోలింగ్ నమోదు
1:36 PM, 7 Nov

బీహార్‌లో ప్రశాంతంగా కొనసాగుతోన్న పోలింగ్
12:45 PM, 7 Nov

బీహార్ చివరి దశ పోలింగ్

బీహార్ చివరి దశ పోలింగ్
ఉదయం 11 గంటల సమయానికి 19.77శాతం పోలింగ్ నమోదు
12:39 PM, 7 Nov

ముజఫర్ పూర్‌లో ఓటింగ్‌కు ప్రజలను చేరవేసేందుకు తాత్కాలిక వంతెన నిర్మించిన స్థానికులు
11:20 AM, 7 Nov

ఉదయం 9 గంటల సమయానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 7.69శాతం పోలింగ్ నమోదు
9:51 AM, 7 Nov

సీతామర్హిలోని రిగా పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో క్యూలైన్లలో అలాగే నిల్చున్న ఓటర్లు
9:49 AM, 7 Nov

లోక్‌తంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణీ మాదేపూర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు
8:48 AM, 7 Nov

దర్బాంగా అరారియాలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు క్యూలైన్లో నిల్చున్న ఓటర్లు
READ MORE

English summary
Bihar goes for third and the final phase of voting tommorow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X