బీహర్‌లో కాల్పుల కలకలం: ఆర్జేడీ నేత బిట్టు సింగ్ సోదరుడి మృతి.. పుర్నియాలో ఉద్రిక్తత..

బీహర్‌ అసెంబ్లీ మూడో విడత పోలింగ్‌లో ఉద్రిక్త నెలకొంది. పుర్నియా జిల్లాలో కాల్పుల కలకలం నెలకొంది. పూర్నియా జిల్లా దందహ అసెంబ్లీ నియోజకవర్గంలో గల సస్త్రీ ఏరియాలో ఫైరింగ్ జరిగింది. ఆగంతకులు కాల్పులు జరిపి.. పారిపోయారు. కాల్పుల్లో ఆర్జేడీ నేత ఒకరు చనిపోయారు.

మూడో విడత పోలింగ్ జరుగుతుండగా కాల్పులు జరిగాయి. ఆర్జేడీ నేత బిట్టు సింగ్ సోదరుడు బేణి సింగ్‌పై ఫైర్ చేశారు. కాల్పులలో ఆ ప్రాంతం రక్తం ఎరులై పారింది. బేణి సింగ్ అక్కడకక్కడే చనిపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బేణి సింగ్ మృతదేహాం పోస్టుమార్టం కోసం పుర్నియా తరలించారు.

Bihar Assembly Election 2020: RJD leader Bittu Singhs brother shot dead in Purnea

ఇటు థర్డ్ ఫేజ్ పోలింగ్‌కు జనం నుంచి రెస్పాన్స్ వచ్చింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 44.6 శాతం పోలిగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుండగా.. క్యూ లైన్‌లో నిల్చొన్నవారికి ఓటేసే అవకాశం ఇస్తారు. గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. పోలింగ్ పర్సంటేజీ పెరగడం.. విజయ అవకాశాలపై ప్రభావం చూపనుంది. మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. ముందస్తు పోల్స్ మాత్రం ఎన్డీఏకు ఓటర్లు పట్టం కడతారని రిపోర్ట్ చేసింది. మరీ ఇవాళ ఏం చెబుతుందో చూడాలీ మరీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+