వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతు పొలం దున్నుతుండగా బయటపడ్డ నోట్ల కట్టలు: సంతోషం క్షణాల్లో అవిరి!

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లా పౌడా గ్రామంలో ఓ రైతు పొలంలో నోట్ల కట్టలు బటయపడ్డాయి. ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా.. నోట్ల కట్టలు గుట్టలుగా వెలుగుచూశాయి. దీంతో అతడు ఎంతో సంతోష పడ్డాడు. కానీ, ఆ సంతోషం క్షణాల్లోనే అవిరైపోయింది.

పొలం దున్నుతుండగా బయటపడ్డ నోట్ల కట్టలు

పొలం దున్నుతుండగా బయటపడ్డ నోట్ల కట్టలు

ఆ వివరాల్లోకి వెళితే.. అజయ్ సింగ్ తన పొలాన్ని దున్నిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు కరెన్సీ నోట్ల కట్టల సంచి ఒకట దొరికింది. ట్రాక్టర్ నాగలికి ఈ సంచి తగలడంతో బయటికి తీశాడు. అందులో రూ. 500, రూ. 1000 నోట్ల కట్టలు ఉన్నాయి. కాగా, ఈ విషయం అజయ్ సింగ్ కు తెలుసే లోగానే అక్కడికి గ్రామస్తులంతా చేరుకుని ఆ నోట్ల కట్టలను ఎవరికి దొరికినంత వారు ఎత్తుకెళ్లారు.

పోలీసులు వచ్చేలోగా కరెన్సీ నోట్లు మాయం

పోలీసులు వచ్చేలోగా కరెన్సీ నోట్లు మాయం

నోట్ల కట్టలకు సంబంధించిన విషయం పోలీసులకు కూడా చేరింది. దీంతో పోలీసులు కూడా అజయ్ సింగ్ పొలం వద్దకు వచ్చారు. అయితే, అప్పటికే గ్రామస్తులంతా ఆ నోట్ల కట్టలను తీసుకుని పారిపోయారు. పొలం లభించిన కొన్ని నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అవన్నీ రద్దైన రూ. 500, రూ. 1000 నోట్లే: సీజ్ చేస్తామన్న పోలీసులు

అవన్నీ రద్దైన రూ. 500, రూ. 1000 నోట్లే: సీజ్ చేస్తామన్న పోలీసులు

అయితే, ఆ నోట్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో రద్దు చేసిన నోట్లే కావడం గమనార్హం. రూ. 500, రూ. 1000 నోట్ల కట్టలతో ఉన్న మూటను పొలంలో ట్రాక్టర్ డ్రైవర్ గుర్తించాడని పోలీసులు తెలిపారు. అయితే, ఈ డబ్బు ఎవరిది? ఎందుకు ఇక్కడ దాచారు? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక, ఈ నోట్లను ఎత్తుకెళ్లిన వారిని గుర్తించి, వారి దగ్గర్నుంచి తిరిగి వాటిని స్వాధీనం చేసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

English summary
Bihar: banned currency notes found in the farm field of farmer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X