తప్పలేదు: బీహార్ సిఎం అస్పృశ్యతా బాధితుడు

పాట్నా: అస్పృశ్యత అనేది సామాన్యులనే కాదు, సాక్షాత్తు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రినీ వదిలిపెట్టలేదు. తాను ఓ దేవాలయాన్ని దర్శించుకున్నందుకు ఆ దేవాలయాన్ని కడిగి శుభ్రం చేశారని బీహార్‌ ముఖ్యమంత్రి జితన్‌ రాం మాంఝీ వెల్లడించారు. దీనికి కారణం తానొక దళితుడు కావడమేనని తెలిపారు.

కొన్ని నెలల క్రితం జరిగిన ఉప ఎన్నికల అనంతరం మధుబన్‌ జిల్లాలోని ఓ దేవాలయానికి వెళ్లిన తనకు ఈ అనుభవం ఎదురైందని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి బోలా పాశ్వాన్‌ శాస్ర్తి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మాంఝీ తన ఆవేదనను వ్యక్తం చేశారు. దళితులకు, వెనుకబడిన కులస్థులకు వ్యతిరేకంగా కొన్ని వర్గాల్లో తీవ్రమైన వివక్ష ఉందని తెలిపారు.

Bihar CM Jitan Ram Manjhi alleges bias against dalits

పని నెరవేర్చేకోవడం కోసంఅగ్రవర్ణాల వారు అవసరమైతే తన పాదాలు కూడా పట్టుకుంటారని, తానొక దళితుడనని తెలిసినా వారు దీనికి వెనుకాడరని మాంఝీ విమర్శించారు. మహా దళితుల పట్ల వర్ణ వివక్ష లోతుగా పాతుకుపోయి ఉందని, తాను కూడా దాని బాధితుడేనని ఆయన చెప్పుకున్నారు.

దేవాలయంలో జరిగిన సంఘటన తనకు తెలియదని, దాని గురిచి గునులు, జియాలజీ శాఖల మంత్రి రామ్ లషన్ రామ్ రామన్ తనకు చెప్పారని ఆయన అన్నారు. అధికార యంత్రాంగంలో కూడా దళితుల పట్ల వివక్ష ఉందని, అది బలహీనవర్గాలకు చెందిన సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో ఆటంకం కల్పిస్తోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+