బీమర్ నుంచి మిమ్మల్నీ ఓటు రక్షిస్తోంది: దర్బాంగ ర్యాలీలో మోడీ, జంగిల్ రాజ్ అని విపక్షాలపై విసుర్లు

బీహర్ ప్రచారం పర్వం మరింత ఊపందుకొంది. దర్బాంగ ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. మళ్లీ ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. లేదంటే తిరిగి జంగల్ రాజ్ అధికారంలోకి వస్తోందని చెప్పారు. వారు అధికారం చేపడితే రాష్ట్రాన్ని దోచేస్తారని పేర్కొన్నారు. గత హయాంలో నేరాలు జరిగిన తీరును మోడీ ఉదహరించారు. గతాన్ని గుర్తుంచుకొని తీర్పు ఇవ్వాలని కోరారు.

Recommended Video

    Bihar Elections 2020 Voting Underway: Modi Urges Voters కనీవినీ ఎరుగని రీతిలో ఓ రాష్ట్ర ఎన్నికలు!!

    బీహర్ స్వయం సమృద్ది కోసం ఆత్మనిర్భర్ మితిలాంచల్, ఆత్మనిర్భర్ బీహర్ కోసం పాటుపడతామని మోడీ చెప్పారు. బీహర్, మితిలాంచల్ మధ్య వేలాది కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపట్టినట్టు వివరించారు. పీఎం ప్యాకేజ్ కింద పనులు చేపట్టామని చెప్పారు. తమ హయాంలో సంక్షేమ పనులు కొనసాగుతాయని.. కానీ వారి పాలనలో కమీషన్ ఇస్తే పనులు చేస్తారని విరుచుకుపడ్డారు.మితిలాంచల్‌లో గల కొసి మహాసేతు ప్రాజెక్టుకు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు అని చెప్పారు.

    Bihar Elections: Your One Vote Can Save Bihar from Becoming Bimaar PM Modi at Darbhanga Rally

    కొందరు రామాలయ నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది అని తమను అడిగారు అని మోడీ గుర్తుచేశారు. ఇప్పుడు ఆలయ నిర్మాణం జరుగుతుండటంతో ప్రశంసిస్తున్నారు అని పేర్కొన్నారు. ఇదీ బీజేపీ, ఎన్డీఏ చేస్తోన్న వాగ్దానం అని తెలిపారు. అంతేకాదు ప్రజలకు ఆహార ఉత్పత్తులు, మంచినీటి సౌకర్యం అందజేశామని తెలిపారు. ఎయిర్ పోర్ట్ వల్ల దర్బాంగ ప్రజలకు మరింత మెరుగైన రవాణా కలిగిందని చెప్పారు. ఆత్మనిర్భర్ బీహర్ వల్ల ప్రజలకు కొత్త అవకాశాలు వస్తాయని చెప్పారు. 10 శాతం రిజర్వేషన్ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+