ఏందిరా అయ్యా.. డ్యాన్స్ గర్ల్‌కి గన్ ఎక్కు పెట్టి మరీ, పెళ్లిలో హల్‌చల్
పెళ్లి అంటే గానా, బజంత్రి ఉండటం సహజమే. ఏరియాను బట్టి బరాత్, డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహించుకుంటారు. అయితే బీహర్‌లో కూడా అలానే ఉంటుంది. కానీ బీహర్, యూపీలో తుపాకీలు ఎక్కువ.. అలా అని ఓ పోకిరి ఏకంగా పెళ్లిలో డ్యాన్స్ జరుగుతుండగా.. వచ్చాడు. డ్యాన్స్ గర్లతో స్టెప్పులేస్తున్నాడు. అక్కడ ఆయనకు అడ్డు ఎవరూ లేరు. సో ప్రాబ్లం లేదు.. కానీ ఆయనే సమస్య.. అతను తుపాకీ తీసుకొని వచ్చాడు. రావడమే కాదు.. ఆ గర్ల్ నాభిలో గన్ ఎక్కుపెట్టి హడలెత్తించాడు. దీంతో ఆ అమ్మాయి పై ప్రాణాలు పైనే పోయాయి.

డ్యాన్స్ చేస్తుండగా.. గన్ తీసుకొచ్చి
గోపాల్‌గంజ్ జిల్లా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల జాదోపూర్ రహదారిలో ఇటీవల పెళ్లి జరిగింది. అక్కడ డ్యాన్స్ గర్ల్ చక్కగా చిందులు వేస్తోంది. అంతా చూస్తున్నారు. అక్కడికి వచ్చిన కృష్ణకుమార్ ఆ అమ్మాయి వద్దకు వచ్చాడు. అయితే చేతిలో పిస్టోల్ ఉంది. ఆ డ్యాన్స్ గర్ల్స్ నాభిపై గురి పెడుతూ డ్యాన్స్ చేశాడు. పెళ్లికి వచ్చిన వారు, పెళ్లి తరపు బంధువులు షాక్ అయ్యారు. ఇదేదో బొమ్మ తుపాకి అనుకొని వాళ్ల డ్యాన్స్‌ని చూశారు. కానీ నిజానికి అదీ రియల్ గన్. దీంతో ఆ అమ్మాయి లోలోన భయాందోళనకు గురయ్యింది.

బుల్లెట్లు లోడ్ చేసిన గన్..
ఆ డ్యాన్స్ గర్ల్ మాత్రం అది బుల్లెట్లు లోడ్ చేసిన తుపాకీ అని తెలిసు.. అలా గజ గజ భయపడింది. స్టేజ్‌పై కృష్ణకుమార్‌తో డ్యాన్స్ చేయడానికి జంకింది. పెళ్లి వేడుకలో అతను ఇలా చేస్తుంటే చెప్పి, ఆపాలి.. కానీ అక్కడున్న వారు అలా చేయలేదు. వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో డ్యాన్స్ గర్ల్ భయపడేది స్పష్టంగా చూడొచ్చు. కాసేపు డ్యాన్స్ చేసినా.. వణుకుతూనే చేసింది. అతడు నాభిలో.. ఇతర ప్రాంతాల వైపు పెట్టడంతో బెంబేలెత్తిపోయింది.

పర్మిషన్ లేదు.. అయినా
వాస్తవానికి పెళ్లిలో మారణాయుధులు ఉపయోగించవద్దు. అందుకు పర్మిషన్ ఉండదు. తుపాకి గురి పెట్టిన వ్యక్తికి ఏమైనా గన్ పర్మిషన్ ఉందా అంటే అది కూడా లేదు. డిస్కో ప్రోగ్రామ్‌కి వచ్చిన ఓ యువకుడు డైరెక్ట్‌గా పిస్టోల్ తెచ్చి పబ్లిక్‌గా డ్యాన్స్ చేస్తున్న లేడీ డ్యాన్సర్‌కి గురి పెట్టాడు. విషయం తెలిసిన గోపాల్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పిస్టోల్‌తో హల్‌చల్ చేసిన వ్యక్తి ఎవరూ అని ఆరా తీస్తున్నారు. అతనికి గన్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై మాత్రం ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ బీహర్, యూపీలో ఇలాంటివి కామనే అంటున్నారు. కానీ తగిన చర్యలను తీసుకోవాల్సి ఉంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications