ఎన్డీయేకు బీహార్లో పెను సవాల్ ! మోడీ ప్రభను మింగేస్తున్న నితీశ్ తప్పులు-తేజస్వికి ఆదరణ..!
దేశవ్యాప్తంగా ఈసారి లోక్ సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు సాధించాలనే లక్ష్యంతో దూసుకుపోతున్న ఎన్డీయే స్పీడుకు బీహార్లో మాత్రం బ్రేకులు పడుతున్నాయి. ముఖ్యంగా మోడీ హవాలో ఈసారి కూడా మెజార్టీ సీట్లు గెలిచి కేంద్రంలో హ్యాట్రిక్ సర్కార్ స్ధాపించాలన్న బీజేపీ కలకు బీహార్ లో మాత్రం సవాళ్లు తప్పడం లేదు. దీనికి ఓ కీలక కారణం సీఎం నితీశ్ కుమార్ ఊసరవెల్లి రాజకీయాలే. నితీశ్ పై కోపం ప్రభావం ఇప్పుడు ఎన్డీయే మీద పడేలా కనిపిస్తోంది.
మోడీ మ్యాజిక్ తో పాటు రామమందిర నిర్మాణం ప్రభావం బీజేపీకి ఉత్తరాదిన ఉన్న ఇతర రాష్ట్రాల్లో పనికొస్తుందో లేదో తెలియదు కానీ బీహార్ లో మాత్రం ఈ పప్పులేం ఉడికేలా కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో బీహార్లో 40కి 39 సీట్లు గెలిచిన ఎన్డీయేకు ఈసారి మాత్రం ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులతో సాగుతున్న ఇండియా కూటమి పెను సవాలే విసురుతోంది. ఈ ఐదేళ్లలో మోడీ ప్రజాదరణ తగ్గకపోయినా, బీజేపీ జట్టు కట్టిన నితీశ్ కుమార్ ఆదరణ మాత్రం భారీగా పడిపోవడమే ఇందుకు కారణం.

అలాగే గత ఎన్నికల వరకూ అండగా ఉన్న దళిత నేత రామ్ విలాస్ పాశ్వాన్ చనిపోవడంతో ఆయన వెనుకే ఉన్న 7 శాతం దళితుల ఓట్లు ఈసారి ఎన్డీయేకు పడటం అనుమానంగా మారింది. పాశ్వాన్ మృతి తర్వాత ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్, పాశ్వాన్ సోదరుడు పశుపతి పరాస్ మధ్య విబేధాలతో లోక్ జన్ శక్తి పార్టీ పరిస్దితే దారుణంగా ఉంది. ఇది ఎన్డీయేకు మరో ప్రతికూలాంశం. అటు గత ఎన్నికల్లో ఎవరికీ మద్దతివ్వకుండా దూరంగా ఉన్న లెఫ్ట్ పార్టీలు ఈసారి ఇండియా కూటమిలో ఉండటం వారికి కలిసొచ్చే అంశం. కమ్యూనిస్టు పార్టీలకు బీహార్లో 10 శాతం ఓటు బ్యాంక్ ఉంది.
ఇక చివరిగా ఆర్జేడీ నేత, లాలూ వారసుడు తేజశ్వి యాదవ్ కు గత ఏడాదిన్నర కాలంలో పెరిగిన ఆదరణ కూడా ఇండియా కూటమికి ప్లస్ అవుతోంది. నితీశ్ తో పోలిస్తే నిన్న మొన్నటి వరకూ ఆయనకు డిప్యూటీగా ఉన్న తేజస్వికి ఇప్పుడు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిచేత్తో ఆర్జేడీని అత్యధిక సీట్లు గెల్చుకున్న పార్టీగా నిలిపిన తేజస్విపై ఈసారి కూడా భారీ అంచనాలున్నాయి. అప్పటి ఎన్నికల్లో ఇచ్చిన భారీ ఉద్యోగాల హామీని 17 నెలల్లో తేజస్వి నిలబెట్టుకున్నారు. అంతే కాదు ఇప్పుడు 17 నెలలు వర్సెస్ 17 ఏళ్లు (నితీశ్) నినాదంతో జనంలోకి వెళ్తున్నారు.
-
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications