కృష్ణుడు వేషధారణలో బీహర్ మంత్రి, కొత్త సంవత్సర వేడుకలు
కృష్ణుడి వేషధారణలో ఆర్ జె డి చీఫ్ లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కృస్ణుడి వేషధారణలో కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు.
పాట్నా :బీహర్ మంత్రి కృష్ణుడి వేషధారణలో కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. తనకు తన సన్నిహితులు ఈ వస్త్రాలను బహుకరించారని ఆర్ జె డి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రకటించారు.
ఆర్ జె డి అధినేత తనయులు ఇద్దరూ బీహర్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒకు డిప్యూటీ సిఎంగా, మరోకరు మంత్రిగా కొనసాగుతున్నారు.అయితే నితీష్ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతున్న తేజ్ ప్రతాప్ యాదవ్ వినూత్నంగా కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు.

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆయన సన్నిహితులు కృష్ణుడి వేషధారణకు సంబందించిన దుస్తులను పిల్లనగ్రోవిని ఆయనకు బహుకరించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అయితే నూతన సంవత్సర వేడుకల కోసం ఆయన తన సన్నిహితులు ఇచ్చిన కృష్ణుడి వేషదారణ వస్త్రాలను ధరించి పిల్లనగ్రోవిని ఊదుతున్నట్టుగా ఫోటోలకు ఫోజులిచ్చాడు.












Click it and Unblock the Notifications