బీహార్ మాల్ ప్రాక్టీస్: పదో తరగతి పరీక్షలు రద్దు, ఒకేరోజు 13 లక్షల జరిమానా
పాట్నా: ఇటీవల బీహర్‌లో పదో తరగతి పరీక్షల్లో భాగంగా జరిగిన మాల్ ప్రాక్టీస్ వ్వవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. మాల్ ప్రాక్టీస్ వ్వవహారం ఓ ఉత్సవంలా సాగింది. ఈ విషయంపై నోరు తెరిచిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వం నుంచి అదేశాలు రాగానే మెరుపు దాడులు చేసిన ఆ రాష్ట్ర అధికారులు శనివారం ఒక్కరోజే కాపీ కొడుతున్న 552 మంది విద్యార్ధలను డీబార్ చేశారు. దీంతో పాటు మొన్న కాలేజీ గోడలు పాకి కాపీలు అందించి రాష్ట్ర పరువును గంగలో కలిపిన ఘటనకు బాధ్యులైన విద్యార్ధులు, వారి తల్లిదండ్రలతో కలిపి మొత్తం 900 మందిని అరెస్టు చేశారు.

దీంతో పాటు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డ విద్యార్ధుల నుంచి శనివారం ఒక్కరోజే రూ. 13 లక్షలు మేరక జరిమానాను బీహర్ అధికారులు వసూలు చేశారు. నాలుగు కేంద్రాల్లో పరీక్షలు రద్దు చేయడంతోపాటు కాపీయింగ్‌కు సహకరించిన ఎనిమిది మంది హోం గార్డులను అదుపులోకి తీసుకుంది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి, జస్టిస్ వికాశ్ జైన్‌లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్.. కాపీయింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని శుక్రవారం మందలించింది. దీనిపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెంటనే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎలాంటి కాపీయింగ్ లేకుండా పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి పి.కె.షాహి, ఉన్నతాధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications