థాక్రేలను వెంటాడుతున్న సుశాంత్ మృతి కేసు..బీహార్ ఎన్నికల్లో శివసేన సత్తా చాటుతుందా..?
బీహార్ ఎన్నికలు క్రమంగా వేడి పుట్టిస్తున్నాయి. బీహార్ ఎన్నికల్లో తాము కూడా పోటీచేస్తామంటూ శివసేన ప్రకటించింది. ఇక ఇప్పటికే బీహార్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాలని శివసేన భావిస్తోంది. ఇందుకోసం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, మంత్రి ఆదిత్య థాక్రేలు రంగంలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు. శివసేన స్టార్ క్యాంపెయినర్లుగా వీరిద్దరూ నిలువనున్నారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు ఇటు బీహార్‌ను అటు మహారాష్ట్రను కుదిపేసిన నేపథ్యంలో బీహార్‌లో ఎంతవరకు శివసేన సక్సెస్ అవుతుందా అనే చర్చ జోరుగా సాగుతోంది.
జస్టిస్ ఫర్ సుశాంత్ క్యాంపెయిన్‌లో భాగంగా మహారాష్ట్ర యువనేత మంత్రి ఆదిత్య థాక్రేను నెటిజెన్లు ఎక్కువగా ట్రోలింగ్ చేశారు. బీహార్ రాష్ట్రానికి చెందిన సుశాంత్ సింగ్ మృతి కేసు సెగ మంత్రి ఆదిత్య థాక్రేకు తగిలింది. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారం నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆదిత్య థాక్రే చెప్పారు. సుశాంత్ సింగ్ మృతితో మహారాష్ట్రలోని ఒక యువ మంత్రికి సంబంధం ఉందంటూ బీజేపీ నాయకులు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆదిత్యా థాక్రేను నెటిజెన్లు టార్గెట్ చేసి ట్రోలింగ్ చేశారు. అయితే ఈ ట్రోలింగ్‌లను ఖండించిన ఆదిత్య థాక్రే ఇలాంటి చిల్లర రాజకీయాలపై మండిపడ్డారు. బీజేపీ అధికారం కోల్పోవడంతో జీర్ణించుకోలేక థాక్రే కుటుంబంపై ఇలాంటి చిల్లర రాజకీయాలు, బురద జల్లే కార్యక్రమాలు చేస్తోందంటూ మండిపడ్డారు.

ఇదిలా ఉంటే బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో సీఎం ఉద్ధవ్ థాక్రే మరియు ఆదిత్య థాక్రేలు ఆన్‌లైన్ ద్వారా ప్రచారం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. మూడు దశల్లో జరగనున్న బీహార్ ఎన్నికల్లో శివసేన పార్టీ 50 సీట్లలో పోటీచేయనుంది. ఉద్ధవ్ థాక్రే మరియు ఆదిత్య థాక్రేలు బీహార్ ఎన్నికల ప్రచారంలో శివసేన పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తారని శివసేన పార్టీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. అంతేకాదు ఎంపీ సంజయ్ రౌత్ కూడా క్యాంపెయిన్‌లో పాల్గొంటారని స్పష్టం చేశారు. కరోనా సమయంలో వీరంతా వర్చువల్ క్యాంపెయినింగ్‌లో పాల్గొంటారని వెల్లడించారు.
Shiv Sena can contest in around 50 seats in the upcoming #BiharElections2020. Maharashtra CM Uddhav Thackeray and state minister Aaditya Thackeray will address virtual rallies: Sanjay Raut, Shiv Sena pic.twitter.com/o3u7WajPhB
— ANI (@ANI) October 9, 2020
Recommended Video
ఇక థాక్రేల, సంజయ్ రౌత్‌లతో పాటు, రాజ్యసభ ఎంపీ అనిల్ దేశాయ్, ప్రియాంక చతుర్వేదిలు కూడా ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎంపీలు అరవింద్ సావంత్, కృపాల్ తుమనే, వినాయక్ రౌత్‌లతో పాటు మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైర్, రాష్ట్ర మంత్రులు సుభాష్ దేశాయ్, గులాబ్‌రావు పాటిల్ పేర్లు కూడా జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఇక రాజస్థాన్ నుంచి శివసేన పార్టీ నేత రాజ్‌కుమార్ బఫ్నా, పంజాబ్ నుంచి యోగ్‌రాజ్ శర్మలు కూడా ప్రచారంలో పాల్గొంటారని శివసేన పార్టీ వర్గాలు తెలిపాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications