అనూహ్య పరిణామం: సీఎం వద్దే హోం
పాట్నా: బిహార్‌లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ఏకంగా 33 మంత్రులు ఈ ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్.. వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కూ మంత్రివర్గంలో చోటు దక్కింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తేజస్వి యాదవ్, జనతా దళ్ (యునైటెడ్), రాష్ట్రీయ జనతాదళ్ ముఖ్య నాయకులు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే వారికి శాఖలను కేటాయించారు నితీష్ కుమార్. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సాధారణ పరిపాలన మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. కేబినెట్‌లో అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖను నితీష్ కుమార్ తన వద్దే అట్టి పెట్టుకున్నారు. దీన్ని ఎవరికీ కేటాయించలేదు. ఆయనే స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తారు.

ముఖ్యమంత్రి తరువాత ఈ స్థాయి ప్రాధాన్యత ఉన్న పోర్ట్‌ఫోలియో కావడం వల్ల దీన్ని మిత్రపక్షం ఆర్జేడీకి కేటాయిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ.. అనూహ్యంగా ఆ శాఖను నితీష్ కుమార్ తన వద్దే ఉంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణ పరిపాలన, హోం, ఇంటెలిజెన్స్ బ్యురో సహా మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. తేజస్వి యాదవ్‌కు ఆరోగ్యం, రోడ్ల నిర్మాణం, మున్సిపల్ పరిపాలన, గృహ నిర్మాణం, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలను కేటాయించారు.
ఆర్థికం, వాణిజ్యం, సభా వ్యవహారాల మంత్రిత్వ శాఖలు కూడా జేడీయూకే లభించాయి. ఈ మూడింటినీ సీనియర్ సభ్యుడు విజయ్ కుమార్ చౌధరికి అప్పగించారు నితీష్ కుమార్. పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖను తేజ్ ప్రతాప్ యాదవ్‌కు కేటాయించారు. బిహార్‌లో కట్టుదిట్టంగా అమలవుతోన్న మద్య నిషేధ పర్యవేక్షణ మంత్రిత్వ శాఖ సునీల్ కుమార్‌కు దక్కింది. షీలా కుమారికి రవాణా, అనిత దేవికి సాంఘిక సంక్షేమం, చంద్రశేఖర్‌కు విద్య వంటి శాఖలను కేటాయించారు.












Click it and Unblock the Notifications