• search

బీహార్ అత్యాచారం కేసు: ప్రభుత్వ నిధుల కోసం అమ్మాయిలను ఎరగా వేసిన నిందితుడు

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
   బీహార్ అత్యాచారం కేసులో కొత్త ట్విస్ట్

   బీహార్ ముజాఫర్‌పూర్‌లో వెలుగు చూసిన బాలికల అత్యాచార ఘటనలో అనేక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సెక్స్ రాకెట్‌కు నేపాల్ నుంచి బంగ్లాదేశ్‌వరుకు మూలాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న బ్రజేష్ ఠాకూర్ ప్రభుత్వం నుంచి నిధులు, ఆర్డర్లు పొందేందుకు అధికారుల వద్దకు షెల్టర్ హోమ్‌లోని అమ్మాయిలను పంపేవాడని తెలుస్తోంది.

   గతవారమే సీబీఐ ఈ కేసును తన చేతుల్లోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. సీబీఐ ముందు పోలీస్ అధికారులు రిపోర్ట్‌ను తయారు చేశారు. దాని ప్రకారం బ్రజేష్ ఠాకూర్‌ కొన్ని ఎన్జీఓలు నడుపుతున్నాడు.తన బంధువులు బ్యాంకుల్లో ఇతరత్ర ప్రభుత్వ సంస్థల్లో కొన్ని కీలక స్థానాల్లో ఉన్నారు. వారి ద్వారా అక్రమ పద్దతుల్లో డబ్బును రాబట్టేవాడు. తాను జర్నలిస్టునని చెప్పుకుని ఎన్నో పనులను అడ్డదారుల ద్వారా చేయించుకున్నాడని రిపోర్ట్ వెల్లడించింది.

   Bihar rape case: Accused used to supply girls for getting govt funds

   అప్పటికే పలు ఎన్జీఓ సంస్థలు నడుపుతున్న ఠాకూర్‌కు బీహార్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ ఓ స్కీమ్‌ను నడపాల్సిందిగా కోరింది. అయితే ఎలాంటి వివరాలు లేదా విచారణ చేయకుండా గుడ్డిగా ఆ బాధ్యత ఠాకూర్‌కు అప్పగించింది. ప్రచారం కల్పించాల్సిందిగా కూడా కోరింది. అయితే ఎయిడ్స్ కంట్రోల్ సంస్థలో పనిచేసే అవినీతి అధికారులకు షెల్టర్ హోమ్ నుంచి ఠాకూర్ అమ్మాయిలను పంపించేవాడని అధికారులు రిపోర్ట్‌లో పొందుపరచారు. అంతేకాదు రెడ్ లైట్ ఏరియా నుంచి అమ్మాయిలను తీసుకొచ్చే బాధ్యత మధుకుమారి అనే మహిళకు అప్పజెప్పినట్లు తెలిపిన రిపోర్ట్ ప్రస్తుతం ఆ మహిళా పరారీలో ఉన్నట్లు తెలిపారు.

   ఇలా అమ్మాయిలను అవినీతి అధికారుల దగ్గరకు పంపిస్తూ ఠాకూర్ మరో రెండు స్కీములను ఎయిడ్స్ కంట్రోల్ అధికారులనుంచి తెప్పించుకున్నాడని రిపోర్ట్ వెల్లడించింది. ఇంకా చాలా విషయాలపై విచారణ చేయాల్సి ఉందని చెప్పిన అధికారులు ఈ కేసులో ఇంకొందరిని అరెస్టు చేయాల్సి ఉందని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఈ సెక్స్ రాకెట్‌ నేపాల్ బంగ్లాదేశ్ వరకు విస్తరించిందని... ఆదేశాల నుంచి కూడా కస్టమర్లు వచ్చేవారని పేర్కొంది.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   Brajesh Thakur, the main accused in the case involving sexual abuse of girls at a Muzaffarpur shelter home, ran an organized sex racket with links stretching as far as Nepal and Bangladesh to win favours in terms of government funds and orders, according to a report of the Muzaffarpur police.The report was prepared before the Central Bureau of Investigation (CBI) took over the probe last week.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   Notification Settings X
   Time Settings
   Done
   Clear Notification X
   Do you want to clear all the notifications from your inbox?
   Settings X
   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more