'గౌరవిస్తాం, సామాజిక సమీకరణాలే కలిసొచ్చాయి'
పాట్నా: బీహార్ ప్రజల తీర్పుని గౌరవిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలపై సమగ్రంగా విశ్లేషించుకుంటామని ఆయన తెలిపారు. సోమవారం రాజకీయ కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

బీహార్‌లో బీజేపీ ఓటమితో దేశమంతా ఇటువంటి పరిస్థితే ఉందంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. బీహార్‌లో మాత్రమే ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ఒక రాష్ట్రంలోని ఫలితాలను దేశం మొత్తానికి ఆపాదించడం సరికాదని ప్రతిపక్షాలకు సూచించారు. బీహార్‌లో మాత్రమే ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
బీహార్ ఎన్నికల ఫలితాలతో శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు ఎటువంటి ఆటంకం కలగదనే అనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. బిహార్ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు విపక్షాలకు కలిసివచ్చాయన్నారు.
బీహార్ లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయి. మొత్తంగా ఐదు దశల్లో జరిగిన బీహార్ ఎన్నికల్లో అత్యధికంగా 56.8 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ఎన్నికల బరిలో మొత్తం 3450 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
ఆదివారం ఓట్ల లెక్కింపులో మహా కూటమి 178 స్థానాల్లో విజయం సాధించగా, ఎన్డీఏకు 58 స్థానాలు మాత్రమే దక్కాయి. 14 జిల్లాల్లో బీజేపీ అసలు ఖాతానే తెరవలేదు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications