వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా వస్తే కుదరదు.. ఉద్యోగులకు కలెక్టర్ వార్నింగ్..

|
Google Oneindia TeluguNews

బీజాపూర్ : ఛత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు డ్రెస్ కోడ్ పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లు, రంగురంగుల దుస్తులు ధరించవచద్దని కలెక్టర్ కేడీ కుంజమ్ స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సర్క్యులర్ పంపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుకు వచ్చేటప్పుడు ఫార్మల్ దుస్తులు మాత్రమే ధరించాలని కుంజమ్ సూచించారు.

ప్రభుత్వ ఉద్యోగులు రంగురంగుల టీ షర్టులు, జీన్స్ స్థానంలో హుందాగా ఉండే దుస్తులు ధరించాలని కలెక్టర్ సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. గ్రూప్ 4 ఉద్యోగులు ప్రతి నెల యూనిఫా వాషింగ్ అలవెన్సు తీసుకుంటున్నా వారు యూనిఫాం ధరించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రూప్ 4 ఉద్యోగులు యూనిఫాం, మిగిలిన ఉద్యోగులు ఫార్మల్ డ్రెస్సుల్లోనే విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.

Bijapur collector imposes dress code on government employees

డ్రెస్ కోడ్ విషయంలో ఆదేశాలను పాటించని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. అయితే కలెక్టర్ ఆదేశాలపై ప్రభుత్వ ఉద్యోగుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. గతంలో తమిళనాడు ప్రభుత్వం సైతం ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది. తమిళ సంస్కృతి లేదా భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ప్రభుత్వ ఉద్యోగుల డ్రెస్సింగ్ ఉండాలని ఆదేశించింది.

English summary
Bijapur collector KD kunjam has issued an order barring governemtn employees from wearing T shirts, jeans and bright coloured clothes to office. officials and employees were to attend office in formals or in uniforms prescribed collector said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X