
Biriyani: స్టార్ హోటల్ లో బిర్యానీ, చికెన్ తిని అమ్మాయి మృతి, 40 మంది ఆసుపత్రిలో, ఏం జరిగిందంటే !
చెన్నై/ తిరువన్నామలై/ మదురై: ఫేమస్ బిర్యానీ సెంటర్ లో స్థానికులు చాలా మంది వారి కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లి కావలసిన మాంసాహార వంటకాలు లాగిస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి అతని భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి బస్ స్టాండ్ సమీపంలోని ఆ హోటల్ కు వెళ్లి బిర్యానీలు, చికెన్ కబాబ్ లు, తందూరి చికెన్, పరోటాలు తిన్నారు. హోటల్ లో సంతోషంగా ఎంకావాలో అవి తిన్న తరువాత కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లిపోయారు. వీరితో పాటు ఆరోజు చాలా మంది ఆ హొటల్ లో బిర్యానీలు, పరోటాలు, చికెన్ కబాబులు, చిల్లీ చికెన్ ఇలా వారికి ఏమి ఇష్టమో ఆ వంటలు తిన్నారు. ఇంటికి వెళ్లిన కుటుంబ సభ్యులు తరువాత వాంతులు చేసుకోవడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 10 ఏళ్ల బాలిక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో బాలిక తల్లిదండ్రులు, ఆమె సోదరుడిని వేరు ఆసుపత్రిలో ఐసీయూకి తరలించారు. ఇదే హోటల్ లో బిర్యానీలు తిన్న సుమారు 40 మంది వాంతులు చేసుకుని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు ఆ హోటల్ కు సీల్ వేసి దాని యజమానితో పాటు వంట మాస్టర్ ను అరెస్టు చేశారు. ఆ ఫేమస్ బిర్యానీ హోటల్ లో ఫుడ్ తిన్న చాలా మంది ఇప్పుడు ఆసుపత్రికి క్యూ కట్టడం కలకలం రేపింది.
First night: ఫస్ట్ నైట్ బెడ్ రూమ్ లో పెళ్లి కొడుకు ఆత్మహత్య. పెళ్లి కూతురు చూసి, ఏం జరిగిందింటే !

ఫేమస్ హోటల్
తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలోని అరణి పట్టణంలోని పాత బస్ స్టాండ్ సమీపంలో న్యూ 7 స్టార్ బిర్యానీ సెంటర్ హోటల్ ఉంది. ఈ హోటల్ లో మాంసాహార వంటకాలు చాలా ఫేమస్. స్థానికంగా నివాసం ఉంటున్న చాలా మంది వారివారి కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ తో కలిసి 7 స్టార్ బిర్యానీ సెంటర్ కు వెళ్లి వారికి ఏం కావాలో అవి ఆర్డర్ ఇచ్చి ఇంతకాలం హ్యాపీగా తింటున్నారు.

ఫ్యామిలీలో వెళ్లాడు
అరణిలో నివాసం ఉంటున్న ఆనంద్ అనే వ్యక్తి అతని భార్య ప్రియదర్శిని, కుమార్తె లోసిని (10), కుమారుడు చరణ్ (14)తో కలిసి బుధవారం 7 స్టార్ హోటల్ కు వెళ్లాడు. హోటల్ లో బిర్యానీ, పరోటాలు, తందూరి చికెన్ తో పాటు షార్వా తీసుకున్న ఆనంద్ కుటుంబ సభ్యులు సంతోషంగా అక్కడే భోజనం చేశారు.

వాంతులు చేసుకుని కుప్పకూలిపోయారు
ఆనంద్, అతని భార్య ప్రియదర్శిని, కుమార్తె, కుమారుడితో కలిసి ఆ హోటల్ లో బిర్యానీలు, చికెన్ కబాబ్ లు, తండూరి చికెన్, పరోటాలు తిన్న తరువాత అక్కడే కొంతసేపు ఉన్నారు. హోటల్ లో సంతోషంగా ఎంకావాలో అవి తిన్న తరువాత ఆనంద్ అతని కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన ఆనంద్, అతని భార్య ప్రియదర్శిని, కూతురు, కొడుకు వాంతులు చేసుకుని కుప్పకూలిపోయారు.

కూతురి ప్రాణం పోయింది
విషయం గుర్తించిన స్థానికులు ఆనంద్ కుటుంబ సభ్యులు నలుగురిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. అనంతరం అందరిని ఆరాని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు. ఆనంద్, అతని భార్య ప్రియదర్శిని, కుమారుడు చరణ్ పరిస్థితి విషమంగా ఉండటంతో వేలూరులోని సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై ఆనంద్ కుమార్తె లోసిని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

హోటల్ సీజ్.... యజామాని, వంట మాస్టర్ అరెస్టు
ఇదే 7 స్టార్ బిర్యానీ హోటల్ లో బిర్యానీలు తిన్న సుమారు 40 మంది వాంతులు చేసుకుని అస్వస్థతకు గురై అరని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు 7 స్టార్ బిర్యానీ హోటల్ కు సీల్ వేశారు. హోటల్ యజమాని అహమ్మద్ పాషాతో పాటు వంట మాస్టర్ మునియందినిని అరెస్టు చేశారు.
Recommended Video

ఫుడ్ పాయిజన్ అయ్యిందా ?
అరనిలోని ఫేమస్ 7 స్టార్ బిర్యానీ హోటల్ లో ఫుడ్ తిన్న చాలా మంది ఇప్పుడు ఆసుపత్రికి క్యూ కట్టడం ఆరని ప్రాంతంలో కలకలం రేపింది. ఫుడ్ పాయిజన్ కారణంగా అమ్మాయి లోసిని మరణించిందని, అందరు అస్వస్థతకు గురైనారని అధికారులు అంటున్నారు. మొత్తం మీద ఆ సంఘటన జరగక ముందు, జరిగిన తరువాత ఆ హోటల్ లో భోజనం చేసిన అందరూ ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసింది. 7 స్టార్ బిర్యానీ సెంటర్ పాత బస్ స్టాండ్ సమీపంలో ఉండటంతో ఆ హోటల్ నిత్యం రద్దీగా ఉంటుంది. మాంసాహార భోజనాలకు ఆ ప్రాంతంలో ఫేమస్ అయిన ఈ హోటల్ లో అవనిలో పనిమీద వచ్చిన వారు ఎక్కువగా బిర్యానీలు, పరోటాలు, చికెన్ తిన్నారా అంటూ అధికారులు ఆరా తీస్తున్నారు. గత బుధవారం, ఆమరుసటి రోజు ఇతర ప్రాంతాలు వారు ఎవరైనా ఇక్కడ వచ్చి బిర్యానీలు, చికెన్ తిన్నారా ?, వారి పరిస్థితి ఎలా ఉంది అంటూ అధికారులు ఆరా తీస్తున్నారు. 7 స్టార్ హోటల్ లో సద్దిపడిన ఆహారం ఏమైనా మరుసటి రోజు వడ్డించడం వలన ఇలా జరిగిందా ? అనే కోణంలో కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. మొత్తం మీద అవనిలో ఓ రైంజ్ లో పేరు ఉన్న హోటల్ లో ఇలాంటి జరగడంతో స్థానికులు హడలిపోతున్నారు.