
ఇదేం కర్మరా బాబు.. బిర్యానీ తింటే అంతేనట, అందుకే షాప్స్ క్లోజ్, ఎక్కడంటే..?
కొందరు తమ మూఢ నమ్మకాలను అన్నింటీపై చూపిస్తారు. దానికి శాస్త్రీయత ఉన్నా లేకున్నా.. అంతే. అవును ఈ కాలంలో ఏం చెప్పినా ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. కానీ కొన్ని తింటే అంతే సంగతులు అని అంటున్నారు. నిజమే బెంగాల్ మాజీ మంత్రి కూడా ఇలానే తన ఫైత్యం చూపించాడు. బిర్యానీ తింటే లైంగిక పటుత్వం తగ్గుతుందని కొత్త వాదనకు తెరతీశాడు. తన భావం వ్యక్తం చేస్తే ఫర్లేదు.. కానీ రెండు బిర్యానీ సెంటర్లు మూసివేయించడం వివాదాస్పదం అవుతుంది.
బెంగాల్ మాజీ మంత్రి, టీఎంసీ నేత రవీంద్ర నాథ్ ఘోష్ ఈ పని చేశారు. బెంగాల్‌లో గల కూచ్ బెహార్‌లో రెండు బిర్యానీ షాపులను మూసి వేయమని బలవంతం చేశారు. బిర్యానీలో ఉపయోగించే మసాలాల వల్ల మగవారిలో లైగింక పటుత్వం తగ్గుతోందని ఆరోపించారు. అందుకోసమే ఆయన ఈ పనిచేశారు.

మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రిగా రవీంద్ర నాథ్ పనిచేశారు. బిర్యానీ చేయడానికి ఉపయోగించే పదార్థాలు, మసాలాలతో మగవాళ్లలో శృంగారంపై కోరికలు తగ్గినట్టు చాలా మంది నుంచి ఫిర్యాదులు అందాయని చెప్పారు. బిర్యానీ చేయడానికి ఏ మసాలాలు ఉపయోగిస్తున్నారో తమకు తెలియదని ఈ ప్రాంత ప్రజలు కొన్నాళ్ల నుంచి చెబుతున్నారు. వాటితో పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గుతోందని ఆరోపిస్తున్నారని తెలిపారు.
బీహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తులు ఈ ప్రాంతంలో బిర్యానీ విక్రయిస్తున్నారట. లైసెన్సు లేకుండా షాపు నిర్వహిస్తున్నారని కూచ్ బెహార్ పాలకులు తెలిపారు. ఫిర్యాదు తర్వాత ఇక్కడికి వచ్చి చూడగా షాపులకు ట్రేడ్ లైసెన్స్ లేదట. అందుకోసమే ఆ షాప్స్ మూసేశామని వెల్లడించారు.