మనిషి కాదు మృగం:వివాహితపై లైంగికదాడి,పదేళ్ల కూతురిపై కూడా..భర్త సహా ఇద్దరి హత్య..
దిశ హత్యోదంతాన్ని యావత్ జాతి ఖండిస్తోంది. నిందితులకు కఠిన శిక్ష విధించాలని, చట్టాలను మార్చాలని డిమాండ్ చేస్తోంది. కానీ దిశ ఘటనకు ముందు ఉత్తర ప్రదేశ్‌లో ఓ మానవ మృగం రెచ్చిపోయింది. వివాహిత, ఆమె పదేళ్ల కూతురిపై లైంగికదాడి చేసి హతమార్చాడు. అడ్డొచ్చిన భర్త, చిన్న పసివాడిని మట్టుబెట్టి తనలోని మృగాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు.

పచ్చని కుటుంబంలో..
ఉత్తర ప్రదేశ్‌లోని అజాంఘడ్‌లో ఓ ఫ్యామిలీ నివసిస్తోంది. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురుకు పదేళ్ల వయస్సు కాగా.. కుమారుడు నెలల వయస్సు పసిగుడ్డు. మరో నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఆ ఇంటిపై నసీరుద్దీన్ అనే నీచుడు కన్నేశాడు. వారం రోజుల నుంచి రెక్కీ నిర్వహించాడు. ఇంటిలో సరైన భద్రతా చర్యలు తీసుకోవడం లేదని గమనించాడు. తన పని తాపీగా పూర్తి చేసుకోవచ్చని భావించాడు. వివాహిత సహా ఆమె భర్త, పసి పాపను మట్టుబెట్టాడు. ఆ ఇంట్లో ముగ్గురిని మట్టుబెట్టి కూతురు, కుమారుడిని అనాధలను చేశాడు. ఆ నేరానికి సంబంధించి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీసులకు వివరించాడు.

అలర్టైన..
ఆ కుటుంబం సరైన భద్రతా చర్యలు పాటించడం లేదని గుర్తించి.. నసీరుద్దీన్ రంగంలోకి దిగాడు. ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించాలని అనుకొన్నాడు. ఆ రోజు రానే వచ్చింది. ఇంట్లోకి ప్రవేశించి ముందు డ్రగ్ కూడా తీసుకున్నాడు. ఇంకేముంది ఇంటి సమీపంలో వచ్చాడు. లాన్ ద్వారా మెయిన్ డోర్ ఉన్న ప్రాంతానికి వచ్చాడు. అక్కడ వెలుగుతున్న లైట్‌ను ఆర్పివేశాడు. మెల్లగా ఇంటి తలుపు తీశాడు. లోపలికి ప్రవేశించడంతో వివాహిత భర్తకు మెలకువ వచ్చింది. వెంటనే వెదురు కర్రతో దాడి చేశాడు.

ఇటుకతో
కానీ నసీరుద్దీన్ చేతిలో ఇటుక ఉంది. దాంతో వివాహిత భర్తపై దాడిచేశాడు. రెండుసార్లు కొట్టడంతో అతను సృహ తప్పి పడిపోయాడు. భర్త పడిపోవడంతో వివాహితకు సృహ వచ్చింది. ఆమెపై కూడా దాడి చేశానని పోలీసులకు నసీరుద్దీన్ తెలిపాడు. జంట మధ్యలో పడుకొని ఉన్న నాలుగునెలల చిన్నారిపై ఇటుక వేయడంతో చనిపోయాడని వివరించాడు. వివాహిత నాలుగేళ్ల కుమారుడు కూడా గాయపడ్డారని నసిరుద్దీన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించాడు.

లైంగికదాడి..
భర్త, 4 నెలల చిన్నారిని హతమార్చక.. వివాహితపై లైంగికదాడికి పాల్పడ్డాడు. తన షర్ట్‌పై రక్తపు మరకలు ఉండటంతో వివాహిత గజ గజ వణికిందని కూడా చెప్పి తన క్రూరత్వాన్ని తెలిపాడు. పదేళ్ల కూతురిపై దాడి చేయాలని అనుకోలేదని పోలీసులకు తెలిపాడు. కానీ ఆమె లేచి నీళ్లు ఇవ్వమన్నదని చెప్పాడు. మమ్మీ పడుకున్నదని చెప్పగా.. మీరెవరు అని, దొంగ, దొంగ, మమ్మా అని అరవడంతో దాడి చేశానని పేర్కొన్నాడు. ఇటుకతో దాడిచేసినట్టు నసిరుద్దీన్ వివరించాడు. వివాహిత ప్రాణం పోయిన లైంగికదాడికి పాల్పడినట్టు వివరించాడు. తర్వాత పదేళ్ల కూతురిపై కూడా రేప్ చేసినట్టు అంగీకరించాడు.

అనాధలుగా కూతురు, కుమారుడు
వివాహితపై లైంగికదాడి చేసి హతమార్చిన నిందితుడు.. అంతకుముందే భర్త, చిన్నారిని కూడా మట్టుబెట్టాడు. ఇక మిగిలిన నాలుగేళ్ల కుమారుడిని గాయపరిచాడు. కూతురిపై లైంగికదాడి చేసి.. అక్కడే సాఫీగా మూడు గంటల పాటు ఉన్నాడు. ఎవరో వచ్చి దొంగతనం చేసి వెళ్లిపోయారని అనుకొవాలని గదినంతా శుభ్రపరిచానని పోలీసులు తెలిపాడు.

ఉరే సరి
నసీరుద్దీన్ నేరవ ప్రవృత్తిపై విచారం వ్యక్తమవుతున్నది. అతను మనిషి.. ఆ రూపంలో ఉన్న మృగమా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. అతని చనిపోయేవరకు ఉరితీయాలని కోరుతున్నారు. దిశ నిందితులకు కూడా అలాంటి శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications