వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

100 కోతులను పోషిస్తున్నాడు: 40ఏళ్లుగా ఆ ఒక్కడే.., భార్య మాటల్ని కూడా లెక్క చేయలేదు..

ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తి గత నాలుగు దశాబ్దాలుగా కోతులను పోషిస్తూ వాటికి తిండి సమకూర్చడం కోసం నిరంతరం శ్రమిస్తున్నాడు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

100 కోతులను పోషిస్తున్నాడు : Indian Man Feeding Monkeys for Decades | Oneindia Telugu

లక్నో: మనుషులు తమ అవసరాల కోసం అరణ్యాలను ధ్వంసం చేస్తుండటంతో వణ్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్న పరిస్థితి ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పెద్ద సమస్యగా తయారైంది.

హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కోతుల బెడదకు పరిష్కారం చూపించడం ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలోను ఎక్కడం గమనార్హం. కోతులు వాపస్ పోవాలంటే అరణ్యాలను పెంచడం ఒక్కటే మార్గమని ఇటు తెలంగాణలో సీఎం కేసీఆర్ పదేపదే ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే.

జనావాసాల్లోకి వచ్చే కోతులు తమ ఆహారం కోసం ఇళ్లలోకి దూరడం, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం వంటి సంఘటనలు తరుచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో వాటిని తరమడం, కొన్నిసార్లు అవి దాడి చేయడం, లేదా మనుషులే వాటిపై దాడి చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

నాలుగు దశాబ్దాలుగా:

నాలుగు దశాబ్దాలుగా:

అలా కాకుండా.. ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తి గత నాలుగు దశాబ్దాలుగా కోతులను పోషిస్తూ వాటికి తిండి సమకూర్చడం కోసం నిరంతరం శ్రమిస్తున్నాడు. మానవత్వాన్ని ప్రపంచమంతా విస్తరించాలన్న ఉద్దేశమే కోతుల పట్ల తనకింత ప్రేమ ఏర్పడటానికి కారణమని చెబుతారాయన. ఇంతకీ ఎవరా వ్యక్తి అంటే కృష్ణకుమార్ మిశ్రా.

భార్య కోప్పడినా వినలేదు:

భార్య కోప్పడినా వినలేదు:

ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఉండే మిశ్రా దాదాపు 100కోతులను పోషిస్తున్నారు. స్వయంగా తన చేతితోనే ప్రేమగా వాటికి తినిపిస్తుంటారు. కోతుల విషయమై చాలాసార్లు భార్యతో విభేదాలు వచ్చినప్పటికీ కృష్ణకుమార్ లెక్క చేయలేదు.

ప్రతీరోజు వందల కొద్ది బ్రెడ్ ముక్కలను తీసుకెళ్లి కోతులకు ఆహారంగా వేస్తారాయన. ఆయనొచ్చారంటే చాలు.. కోతులు సైతం రయ్యిమని ఆయన వద్దకు పరిగెత్తుకెళ్లి మీద పడుతాయి. అయితే తానొక్కడే వంద కోతులను పోషించడం కష్టం కాబట్టి, హోటల్స్ మరియు మరికొందరి సహాయం తీసుకుంటున్నాడు

ఎవరైనా దానం చేస్తే!:

ఎవరైనా దానం చేస్తే!:

హాటల్స్ లో మిగిలిపోయిన చపాతీ వంటి ఆహార పదార్థాలను ఇవ్వమని వారిని కోరుతున్నాడు. హోటల్స్‌తో పాటు ఇళ్లల్లోను చాలామందిని కోరాడు. మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఇవ్వాల్సిందిగా అతను చేసిన విజ్ఞప్తికి చాలామంది స్పందించారు. కొంతమంది ముందుకు వచ్చి తమవంతుగా కొంత ఫుడ్‌ను దానం చేస్తున్నారు.

ఎవరూ ఇవ్వకపోతే:

ఎవరూ ఇవ్వకపోతే:

కొన్నిసార్లు ఎవరూ ఆహార పదార్థాలను దానం చేయడానికి ముందుకు రాకపోతే.. తానే స్వయంగా చపాతీలు చేసి తీసుకెళ్తాడు. తాను చేస్తున్న పనికి తన భార్య ఎప్పుడూ కోప్పడుతుందని, కానీ తన కూతురు మాత్రం సహాయం అందిస్తోందని చెబుతున్నాడు.

English summary
Krishna Kumar Mishra uses his hands to feed monkeys, lovingly loving them, and also raises the loaves for more monkeys. Many times he fight with his wife too.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X