వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీలో బ్లూఫిల్మ్ చూసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే!

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్‌ శాసనసభ్యుడు నబొదాస్‌ తన స్థానంలో కూర్చుని స్మార్ట్‌ఫోన్‌లో నీలి చిత్రాలు చూసినట్లుగా సోమవారం ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అధికార పక్ష బిజూ జనతాదళ్‌(బిజెడి) సభ్యులు ఆయనపై విరుచుకుపడ్డారు.

బిజు జనతాదళ్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రమీలా మల్లిక్‌ మీడియాతో మాట్లాడుతూ.. శాసనసభలో పవిత్రమైన సభలో బ్లూ ఫిల్మ్‌లు(నీలిచిత్రాలు) చూడటం నేరమని, దీనిపై దర్యాప్తు చేసి నబొదాస్‌ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. బిజెడి శాసనసభ్యుడు అమర్‌ శత్పథి మాట్లాడుతూ.. ఈ సంఘటన సభ గౌరవానికి మాయని మచ్చ తెచ్చిందన్నారు.

BJD seeks action against Cong MLA for watching 'objectionable' video in House

కాగా, దీనిపై నబొదాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. స్మార్ట్‌ఫోన్‌ వినియోగంపై తనకు అంతగా అవగాహన లేదని.. కీలకమైన పత్రాలు చూసేందుకు అంతర్జాలంలో వెతుకుతుండగా పొరపాటున వేరే వెబ్‌సైట్‌లో ప్రవేశించడంతో నీలిచిత్రాలు కనిపించాయే తప్ప ఉద్దేశపూర్వకంగా తాను తప్పు చేయలేదని చెప్పారు.

అవసరమైతే దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. శాసనసభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నందున తనపై దుష్ప్రచారం చేస్తున్నారని నబొదాస్ ఆరోపించారు. కాగా, అసెంబ్లీ స్పీకర్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే నబొదాస్‌ను మంగళవారం సస్పెండ్ చేశారు.

English summary
BJD MLA Pramila Mallick today demanded action against a senior Congress lawmaker accusing him of watching "objectionable" video on his mobile phone during the Question Hour in the Assembly today, a charge denied by the MLA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X