సోనియాకు జార్జ్ సోరోస్ తో లింకులు-బీజేపీ షాకింగ్-కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్..!

హంగేరియన్ అమెరికా వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ కు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సంబంధాలు ఉన్నాయంటూ పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి కిరణ్ రిజిజు చేసిన ఆరోపణలు ఇవాళ పార్లమెంట్లో కలకలం రేపాయి. భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న జార్జ్ సోరోస్ తో కాంగ్రెస్ పార్టీ సంబంధాలు తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఆయన ఆరోపించారు. ఇలాంటి విషయాలను రాజకీయంగా చూడకూడదని, దేశ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు.

జార్జ్ సోరోస్ కు చెందిన ఫౌండేషన్ ద్వారా నిధులు సమకూర్చిన సంస్థలతో సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపణలు చేసింది. కాశ్మీర్‌ను ప్రత్యేక ప్రాంతంగా పరిగణించడం వంటి వివాదాస్పద వైఖరికి ఈ సంస్థలు మద్దతు ఇచ్చాయని గుర్తుచేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో డెమోక్రాటిక్ నేతల ఫోరానికి సోనియాగాంధీ గతంలో నాయకత్వం వహించిన అంశాన్ని బీజేపీ గుర్తుచేసింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కూ, జార్జ్ సోరోస్ సంస్థలకు ఉన్న సంబంధాలను కూడా తెరపైకి తెచ్చింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది.

bjp alleges Sonia gandhi-george soros links congress says no question of anti-india stance

కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం.. బీజేపీ ఆరోపణల్ని డార్క్ ఫాంటసీలుగా అభివర్ణించారు. డార్క్ వెబ్ తో బీజేపీకే సంబంధాలు ఉన్నాయని తెలిపారు. తాము దేశభక్తులమని, ఎట్టి పరిస్ధితుల్లోనూ దేశ వ్యతిరేక శక్తుల్ని సమర్దించే ప్రశ్నే తలెత్తదని కార్తీ చిదంబరం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనిపై పార్లమెంట్ లోనూ రచ్చ కొనసాగుతోంది. లోక్ సభ పదే పదే వాయిదా పడుతోంది. అటు ఇండియా కూటమిలో పార్టీ ఆర్జేడీ కూడా ఆధారాలుంటే ప్రభుత్వం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+