రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాకే యోగి ఆదిత్యనాథ్ రాజీనామా!..

అధిష్టానం ఆదేశాలతో రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే వీరు రాజీనామా చేయనున్నారు. వీరితో పాటు యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే రాజీనామా చేయనున్నారు.

న్యూఢిల్లీ: 2017 జులై 24న ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీ కాలం ముగిసిపోతున్న సంగతి తెలిసిందే. ఈలోపు మరొకరిని రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సి ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల ఓట్లు కీలకం కావడంతో.. గోవా సీఎం మనోహర్ పారికర్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లను అప్పటివరకు రాజీనామా చేయకుండా ఉండాల్సిందిగా పార్టీ ఆదేశించినట్లు సమాచారం.

ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ లోక్ సభ ఎంపీగా, మనోహర్ పారికర్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అధిష్టానం ఆదేశాలతో రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే వీరు రాజీనామా చేయనున్నారు. వీరితో పాటు యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే రాజీనామా చేయనున్నారు.

BJP CMs to resign as MPs after presidential polls

కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఈ ముగ్గురు ఎంపీ పదవులకు రాజీనామా చేసి రాష్ట్రాల లెజిస్లేటర్ సభ్యులుగా ఎన్నిక కావాల్సిన అవసరముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+