వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ లో బీజేపీ, కాంగ్రెస్ లకు చావుదెబ్బ; ఆమ్ ఆద్మీ విజయం వెనుక కారణాలు ఇవే !!

|
Google Oneindia TeluguNews

పంజాబ్లో ప్రధాన జాతీయ పార్టీలను పక్కన పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. పంజాబ్ లో బీజేపీ, కాంగ్రెస్ లకు కేజ్రీవాల్ షాక్ ఇచ్చారు. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటి పంజాబ్లో తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ రాష్ట్రంలో విజయం ఏవిధంగా సాధ్యమైంది అన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 నిజమైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు...పంజాబ్ లో ప్రత్యర్థి పార్టీలను ఊడ్చేసిన చీపురు

నిజమైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు...పంజాబ్ లో ప్రత్యర్థి పార్టీలను ఊడ్చేసిన చీపురు


అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ గత ఎన్నికల్లోనూ పంజాబ్ లో పోటీ చేసింది. అయితే అప్పుడు పెద్దగా రాణించలేకపోయింది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ రెండవ ప్రయత్నంలో, పంజాబ్‌ను స్వాధీనం చేసుకుంది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఢిల్లీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ రెండవ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా ఎదిగిందన్న, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం గా కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ విజేతగా నిలిచింది. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది.

 ఆమ్ ఆద్మీ విజయం వెనుక కారణాలు ఇవే .. రైతుల ఉద్యమంతో లబ్ది

ఆమ్ ఆద్మీ విజయం వెనుక కారణాలు ఇవే .. రైతుల ఉద్యమంతో లబ్ది


ఆమ్ ఆద్మీ పార్టీ విజయం వెనుక కారణాలను విశ్లేషిస్తే రాష్ట్ర సరిహద్దు రాష్ట్రమైన ఢిల్లీ అభివృద్ధి నమూనా రాష్ట్ర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఇదే సమయంలో కేంద్రంలోని వ్యవసాయ చట్టాలను వ్యతిరేఖిస్తూ పంజాబ్ రాష్ట్ర రైతులు ఢిల్లీ కేంద్రంగా ఆందోళనను కొనసాగించిన సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ రైతుల పక్షాన నిలిచి, వారికి మద్దతు ఇచ్చింది. ఏడాది పాటు అరవింద్ కేజ్రీవాల్ రైతుల పక్షాన బీజేపీ సర్కార్ పై తన నిరసన గళం వినిపించారు. అవసరం అయినప్పుడు వారికి అండగా నిలిచారు. ఈ పరిణామం కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ లో కలిసి వచ్చిందని చెప్పొచ్చు.

కాంగ్రెస్ అంతర్గత పోరు, బీజేపీపై పంజాబ్ రైతుల వ్యతిరేకత

కాంగ్రెస్ అంతర్గత పోరు, బీజేపీపై పంజాబ్ రైతుల వ్యతిరేకత

ఇదిలా ఉంటే నవంబర్‌లో కాంగ్రెస్ తన ముఖ్యమంత్రిని చివరి నిమిషంలో మార్చింది. పంజాబ్‌లో దాని అత్యంత సీనియర్ నాయకుడైన అమరీందర్ సింగ్ స్థానంలో దళిత నాయకుడు చరణ్‌జిత్ సింగ్ చన్నీని మాస్ బేస్‌తో భర్తీ చేసింది. ఈ చర్య ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యొక్క తెలివైన స్టెప్ గా భావించిన అమరీందర్ సింగ్ ఎమ్మెల్యేలు , ఓటర్లలో ప్రజాదరణ పొందలేదని నివేదించబడింది. చరణ్‌జిత్ సింగ్ చన్నీని పంజాబ్ ప్రజలు అంతగా ఆదరించ లేదు అని తెలుస్తుంది. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యవహారం, పార్టీలో అంతర్గత పోరు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం చేకూరింది. ఇక సాగు చట్టాలను తెచ్చిన బీజేపీ తీరును మొదటి నుండి పంజాబ్ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. సాగు చట్టాల రద్దు చేసినా సరే బీజేపీ పంజాబ్ ప్రజల మనస్సులో స్థానం దక్కించుకోలేకపోయింది.

సీఎం అభ్యర్థిగా భగవంత్ సింగ్ మాన్ .. ఆప్ కు కలిసొచ్చిన సర్వే

సీఎం అభ్యర్థిగా భగవంత్ సింగ్ మాన్ .. ఆప్ కు కలిసొచ్చిన సర్వే


ఇదే సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ సింగ్ మాన్ అని అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటన కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి లభించింది. ఆప్ దాని మద్దతుదారులలో నిర్వహించిన ఫోన్-ఇన్ సర్వే ఆధారంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. సరిహద్దు రాష్ట్రం కోసం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్న క్రమంలో ఆయనను ఖలిస్తాన్ స్వతంత్ర రాష్ట్రాన్ని కోరుకునే వేర్పాటువాదులతో సోదరభావంతో ఉన్నారని సీనియర్ ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఖలిస్తాన్ ఉగ్రవాదితో పోలుస్తూ విమర్శలు చేసినా పంజాబ్ ప్రజలు మాత్రం చీపురు పార్టీ అధినేత పారదర్శక పాలననే గుర్తించినట్లుగా తెలుస్తోంది.

ఢిల్లీ అభివృద్ధి నమూనాకు.. పంజాబ్ లో పట్టం కట్టిన పంజాబీలు

ఢిల్లీ అభివృద్ధి నమూనాకు.. పంజాబ్ లో పట్టం కట్టిన పంజాబీలు


ఆప్‌కి రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తే పంజాబ్‌ భద్రతకు విఘాతం కలుగుతుందని ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శలు గుప్పించినా పంజాబ్ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ ను చాలా బలంగా విశ్వసించినట్లు కనిపిస్తుంది. బిజెపి, కాంగ్రెస్ లు ఓటర్లను ఆకట్టుకునే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రెండు పార్టీలను పట్టించుకోని ఓటర్లు చీపురు పార్టీ నాయకులకు పట్టం కట్టారు. రెండేళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకుడిగా ఉండాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుంది. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ విజయం సాధించిన స్థాయి ఆ పార్టీకి ధైర్యాన్నిస్తుంది. ఢిల్లీలో పార్టీ తన పాలనా నమూనా ఇతర రాష్ట్రాలపై విజయం సాధిస్తోందని పంజాబ్ లో విజయం సాధించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నిరూపించినట్లయింది.

English summary
In Punjab, the Aam Aadmi Party gave shock to the BJP and the Congress. The reasons behind the success of the AAP are now widely discussed. these are the reasons behind AAP victory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X