కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సీఎం ఇబ్రహీంకు రెండు ఓటరు ఐడీ కార్డులు, ఎన్నికల కమిషన్!

బెంగళూరు: కర్ణాటక విధాన పరిషత్ సభ్యుడు (ఎమ్మెల్సీ), కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీఎం. ఇబ్రహీం రెండు ప్రాంతాల్లో ఓటరు ఐడీ కార్డులు తీసుకుని ఓటు హక్కు వినియోగించుకుని చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తున్న బీజేపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చెయ్యడానికి సిద్దం అయ్యింది.

రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీఎం. ఇబ్రహీంకు ఎలా ఓటరు ఐడీ కార్డులు మంజూరు చేశారు అని బీజేపీ ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీఎం. ఇబ్రహీం మీద ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ సీనియర్ నాయకుడు పద్మనాభ రెడ్డి అంటున్నారు.

బెంగళూరు నగరంలోని శివాజీనగర శాసన సభ నియోజక వర్గంలో ఒక ఓటరు ఐడీ కార్డు, శివమొగ్గ జిల్లా భద్రావతి శాసన సభ నియోజక వర్గంలో సీఎం. ఇబ్రహీం మరో ఓటరు ఐడీ కార్డు తీసుకున్నారని బీజేపీ నాయకుడు పద్మనాభ రెడ్డి ఆరోపించారు.

BJP decided to complaint against Congress leader CM Ibrahim for having two voter IDs in his name.

ప్రజలు ఎవరైనా సరే ఒక ప్రాంతంలోని చిరునామాతో ఓటరు ఐటీ కార్డు తీసుకోవాలి. రెండు చిరునామాలతో రెండు ప్రాంతాల్లో ఓటరు ఐడీ కార్డులు తీసుకోవడం చట్టప్రకారం నేరం, ఎమ్మెల్సీ కావాలనే ఆశతో సీఎం. ఇబ్రహీం రెండు ప్రాంతాల్లో ఓటరు ఐడీ కార్డులు తీసుకున్నారని బీబీఎంపీ ప్రతిపక్ష నాయకుడు (బీజేపీ) పద్మనాభ రెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీఎం. ఇబ్రహీం మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పద్మనాభ రెడ్డి నేతృత్వంలో బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చెయ్యడానికి సిద్దం అయ్యారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సీఎం ఇబ్రహీం అత్యంత సన్నిహితుడు. త్వరలో సీఎం. ఇబ్రహీంకు మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన మీద ఫిర్యాదు చెయ్యడానికి బీజేపీ సిద్దం అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+