వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ రైతుల ఆగ్రహాం.. అందుకే బీజేపీ పరాభావం: శరద్ పవార్ లెక్కలివీ..

|
Google Oneindia TeluguNews

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై క్లారిటీ వచ్చింది. పంజాబ్‌లో ఆప్, మిగతా చోట్ల బీజేపీ జయభేరీ మోగించింది. అయితే పంజాబ్‌లో కూడా బీజేపీకి జనం విశ్వసించేవారని తెలుస్తోంది. వివాదాస్పద రైతు చట్టాలే వారికి శాపంగా మారాయని అంటున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపలేకపోవడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. పంజాబ్ రైతులు ప్రధాని మోడీపై ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు.

Recommended Video

BJP Defeat In The Punjab Due To Farmers Angry | Oneindia Telugu

రైతుల కోపం ఎన్నికల ఫలితాలతో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. పంజాబ్ ప్రజలు బీజేపీని ఓడించారని వెల్లడించారు. పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ సొంత పార్టీ పెట్టి బీజేపీతో జట్టుకట్టడం కూడా పంజాబ్ ప్రజలకు నచ్చలేదన్నారు. పంజాబ్‌లో ఆప్ 90కి పైగా స్థానాలు చేజిక్కించుకునే దిశగా పరుగులు తీస్తుండగా, బీజేపీ కూటమి 2 స్థానాలతో సరిపెట్టుకుంది. మహారాష్ట్రలో తమ పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి బీజేపీ మరో రెండున్నరేళ్లు ఆగాల్సి ఉంటుందని అన్నారు.

bjp defeat in the punjab due to farmers angry

ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభంజనం ముందు అఖిలేశ్ యాదవ్ ప్రభావం కనిపించకపోవడంపై పవార్ స్పందించారు. అందులో అఖిలేశ్ తప్పేమీలేదని వివరించారు. సమాజ్ వాదీ పార్టీ సొంతంగానే పోటీ చేసిందని చెప్పారు. ఎన్నికల ఫలితాల గురించి అఖిలేశ్ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అఖిలేశ్ జాతీయస్థాయి నేత అని తెలిపారు. గతంలో కంటే మిన్నగా పోరాడారని గుర్తుచేశారు.

యూపీలో గెలవడం అన్నీ పార్టీలకు ఇంపార్టెంట్.. యోగి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుందని అనుకున్నారు. అఖిలేశ్ యాదవ్.. తెగ కష్టపడ్డారు. కానీ ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రచారం చేసింది. ప్రియాంకకు బాధ్యతలు అప్పగించారు. ఒకనొక క్రమంలో సీఎం అని కూడా ప్రకటన చేశారు. తర్వాత నాలిక కరుచుకొని మిన్నకుండిపోయారు. కానీ ఆ పార్టీ యూపీలో సింగిల్ డిజిట్ రావడం శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎన్ని సీట్లు వచ్చినా.. 10-20 కదా అంటున్నారు. బీఎస్పీ పరిస్థితి కూడా అదే.. అవును ఆ పార్టీ కూడా కాంగ్రెస్ మాదిరిగానే పరిస్థితి ఉంది. యోగి వైపు జనం మొగ్గు చూపారు.

English summary
bjp defeat in the punjab assembly elections due to farmers angry ncp chief sharad pawar said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X