పేరు మార్చం, సిద్దూ: రాజీనామా చెయ్యి, బీజేపీ
బెంగళూరు: కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్చేది లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. బెంగళూరు నగర శివార్లలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలనే వాదన తెరమీదకు వచ్చిన సమయంలో సీఎం సిద్దరామయ్య ఈ విధంగా స్పందించారు.
కర్ణాటక ప్రభుత్వం టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహించిన సమయంలో ఈ వాదన వచ్చింది. అయితే టిప్పు సుల్తాన్ జయంతిని వ్యతిరేకిస్తూ నిర్వహించిన ర్యాలీలో గొడవలు మొదలైనాయి. ఈ గొడవలలో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెంటనే రాజీనామా చెయ్యాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల జీవితాలతో సిద్దరామయ్య ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నదని కర్ణాటక బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
కర్ణాటక ప్రజల మనోభావాలను సిద్దరామయ్య ప్రభుత్వం గౌరవించాలని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు సూచించారు. బెంగళూరు వ్యవస్థాపకుడు కెంపేగౌడను కర్ణాటక ప్రభుత్వం గౌరవించాలని అన్నారు. సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా స్పందించాని వెంకయ్యనాయుడు చెప్పారు.












Click it and Unblock the Notifications