తమిళనాడులో సంచలనం- అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు.. సీఎం అభ్యర్థి ఆయనే

తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేస్తామని అమిత్ షా స్పష్టంచేశారు.

ఈ మేరకు అమిత్ షా అన్నాడీఎంకే చీఫ్‌ పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో కలిసి చెన్నైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్నాడీఎంకే నేత పళనిస్వామి నేతృత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తామని అమిత్‌ షా ఈ మేరకు ప్రకటించారు. ఈ మేరకు తమ కూటమి సీఎం అభ్యర్థిగా అన్నాడీఎంకే చీఫ్‌ పళనిస్వామిని ప్రకటించారు అమిత్ షా.

BJP Forms Alliance with AIADMK in Major Tamil Nadu Political Move

ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందని అమిత్‌ షా ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. అధికారం, సీట్ల పంపకాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాలను జోక్యం చేసుకోమని అమిత్ షా పేర్కొన్నారు.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+