Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లిక్కర్ స్కాం అప్రూవర్ నుంచి బీజేపీకి 44.5 కోట్ల విరాళం-బయటపెట్టిన ఎన్నికల బాండ్లు..!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం అరవింద్ కేజ్రివాల్ అరెస్టు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈడీ నిన్న రాత్రి కేజ్రివాల్ ను అరెస్టు చేసి ఇవాళ కోర్టులో హాజరుపర్చేందుకు సిద్దమవుతోంది. కేజ్రివాల్ అరెస్టుపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈడీతో పాటు కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో నిన్న ఎన్నికల కమిషన్ బయటపెట్టిన ఎన్నికల బాండ్ల డేటా ఇదే కేసులో బీజేపీకి అందిన విరాళాల్నీ బయటపెట్టింది.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆప్, బీఆర్ఎస్ నేతల పాత్ర ఉందంటూ వరుసగా అరెస్టులు చేస్తున్న ఈడీ.. ఇదే కేసులో అప్రూవర్ గా మారిన అరబిందో ఫార్మా అధినేత పినాక శరత్ చంద్రారెడ్డి నుంచి బీజేపీ తీసుకున్న ఎన్నికల బాండ్ల విరాళాలపై ఎందుకు దృష్టిసారించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శరత్ చంద్రారెడ్డికి చెందిన అరబిందో ఫార్మా ఆయన మద్యం కేసులో అప్రూవర్ గా మారక ముందే బీజేపీకి ఎన్నికల బాండ్ల ద్వారా రూ.5 కోట్లు విరాళంగా చెల్లించింది. అప్రూవర్ గా మారాక మరో 35 కోట్లు చెల్లించింది. మరో విడతలో మిగతా మొత్తం చెల్లించినట్లు ఎన్నికల బాండ్ల డేటా బయటపెట్టింది.

bjp got rs 44 5 cr donation from liquor scam approver s firm revealed from electoral bonds data

దీంతో మద్యం కేసులో విపక్షాలతో పాటు బీజేపీ కూడా లబ్ది పొందిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఫ్యాక్ట్ చెకర్ మొహమ్మద్ జుబైర్ ఈ మేరకు బీజేపీకి అరబిందో నుంచి అందిన విరాళాలకు సంబంధించిన ఎన్నికల బాండ్ల డేటాను బయటపెట్టారు. దీంతో శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్ గా మార్చాక బీజేపీకి ఇంత భారీ మొత్తంలో విరాళాలు అందడం చర్చనీయాంశమవుతోంది. కానీ ఇప్పటివరకూ ఈడీ ఏ ఒక్క బీజేపీ నేతనూ ఈ కేసులో అరెస్టు చేయకపోవడం విశేషం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+