అప్పను కాదని ఏమీ చెయ్యలేమప్ప, కళ్లు తెరచిన మోదీ, అమిత్ షా, సర్వం అప్పమయం!

కర్ణాటకలోని 28 లోక్‌సభ నియోజకవర్గాల్లో 20 స్థానాలకు బీజేపీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. జేడీఎస్ కి మూడు సీట్లు ఇవ్వగా, మరో ఐదు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు పెండింగ్‌లో ఉన్నాయి. కర్ణాటకలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల పేర్లను చూసిన తర్వాత బీజేపీ హైకమాండ్ మీద మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప ప్రభావం బలంగా కనిపిస్తోంది.

కర్ణాటక రాష్ట్రంలోని బీజేపీ నేతలను ఎదిరిస్తే మనుగడ లేదన్న సందేశాన్ని ఈ జాబితా ద్వారా బీఎస్‌ యడియూరప్ప బీజేపీ హైకమాండ్ కు ఇచ్చారని స్పష్టం అయ్యింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజీ రాజకీయాల గురించి, కర్ణాటకలోని బీజేపీ నేతలపై చులకనగా మాట్లాడిన మైసూరు-కొడగు ఎంపీ ప్రతాప్ సింహాకు ఎంపీ టికెట్ దక్కలేదు. ఇప్పుడు మైసూరు-కొడుగు నియోజకవర్గం నుంచి మైసూరు మహారాజుల వంశానికి చెందిన యదువీర్ వడయార్‌కు బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది.

BJP high command has given more MP seats to BS Yeddyurappa faction in Karnataka

ఉడిపి-చిక్కమగళూరు ఎంపీ, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే మరోసారి ఎంపీ టికెట్ దక్కించుకోవడంలో విజయం సాధించారు. అయితే ఈసారి శోభా కరంద్లాజే ఉడిపి-చిక్కమగళూరు కాకుండా బెంగళూరు ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. చిక్కమగళూరు-ఉడిపి నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు ఎంపీ శోభా కరంద్లాజేపై తిరుగుబాటు చెయ్యడంతో ఆమె అక్కడి నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు.

దాని కోసం మనసు మార్చుకున్న బీజేపీ హైకమాండ్ శోభా కరంద్లాజేకు బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం టికెట్ వచ్చింది. కుటుంబ రాజకీయాలను వ్యతిరేకించే బీజేపీ మాత్రం మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుటుంబానికి పెద్దపీట వేసింది. బీఎస్ యడియూరప్ప విషయంలో మాత్రం బీజేపీ కుటుంబ రాజకీయాలను పట్టించుకోవడం లేదని వెలుగు చూసింది. శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై. రాఘవేంద్రకు టికెట్‌ దక్కింది.

BJP high command has given more MP seats to BS Yeddyurappa faction in Karnataka

మరో లింగాయత్ నాయకుడు వి. సోమన్నకు తుమకూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి టికెట్‌ లభించింది. తుమకూరు లోక్ సభ నియోజకవర్గంలోని ప్రముఖ బీజేపీ నేతల నుంచి వ్యతిరేకత వచ్చినా సోమన్నకు బీజేపీ హైకమాండ్ టికెట్ ఇచ్చింది. హవేరీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం బసవరాజ్ బొమ్మైయ్ కి టికెట్ దక్కింది. ఈ జాబితా ద్వారా కర్ణాటక బీజేపీలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావం కంటే బీఎస్‌ యడియూరప్ప ప్రభావం ఎక్కువగా ఉందని తేలిపోయింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్ యడ్యూరప్పను విస్మరించిన బీజేపీ హైకమాండ్ ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో ఎన్నికల్లో గెలుస్తామని భావించి కొత్తకొత్త ప్రయోగాలు చేసిన బీజేపీ నేతలకు కర్ణాటక ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. బీజేపీ, నరేంద్ర మోదీ వేవ్‌ను కాంగ్రెస్‌ తుడిచిపెట్టేసింది. ఓటమి తర్వాత బీజేపీ హైకమాండ్ కళ్లు తెరచి కర్ణాటకలో బీఎస్ యడియూరప్పను కాదని ఏమీ చెయ్యలేమని గ్రహించింది.

BJP high command has given more MP seats to BS Yeddyurappa faction in Karnataka

తరువాత బీఎస్ యడియూరప్పను సూచనలను పరిగణలోకి తీసుకుని ఆయనతో చర్చించి ఇప్పుడు అన్ని నిర్ణయాలు తీసుకుంటోంది. బీఎస్‌ యడియూరప్ప కోరిక మేరకు ఈసారి చాలా మంది ఆయన వర్గంలోని నాయకులనే ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించారు. ఊహించినట్లుగానే ఈసారి కర్ణాటకలో ఎక్కువ లోక్ సభ స్థానాల్లో బీజేపీ గెలిస్తే ఆరాష్ట్రంలో బీజేపీలో ప్రశ్నించలేని నేతగా బీఎస్ యడియూరప్ప నిలుస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+