వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్వానీజీ! కష్టకాలంలో మీకు అండగా ఉంటాం: అమిత్ షా

బీజేపీ మీ వెంటే ఉంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి చెప్పారని తెలుస్తోంది. ఇటీవల బాబ్రీ కేసులో అద్వానీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషిలపై కుట్ర కేసును తిరగదోడ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బీజేపీ మీ వెంటే ఉంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి చెప్పారని తెలుస్తోంది. ఇటీవల బాబ్రీ కేసులో అద్వానీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషిలపై కుట్ర కేసును తిరగదోడాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కష్టకాలంలో ఉన్న అద్వానికి పార్టీ వెన్నంటే ఉంటుందని అమిత్ షా తెలిపారు. బాబ్రీ పరిణామాల నేపథ్యంలో వచ్చే సవాళ్లను ఎలా ఎదుర్కొవాలో అనే విషయంపై పార్టీ వ్యూహాన్ని ఖరారు చేసింది. అనంతరం ఆయన భాజపా అగ్రనేత అద్వానీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆయనకు సంఘీభావం తెలిపారు.

BJP is with you, Says Amit Shah to LK Advani on Babri verdict

అయోధ్యకు వద్దు..

కోర్టు తీర్పు నేపథ్యంలో నేడు అయోధ్య వెళ్లాలని కేంద్రమంత్రి ఉమాభారతి భావించారు. తనపై కుట్ర ఆరోపణలను ఉమాభారతి తిరస్కరించారు. దీనిలో కుట్రకు అవకాశం ఏముందని, అక్కడ రామమందిరం నిర్మించగా చూడాలనేది తన కల అని బహిరంగంగా చెప్పానని వ్యాఖ్యానించారు.

విషయం తెలుసుకున్న అమిత్ షా ఆమెకు ఫోన్‌ చేసి ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని కోరారు. అందరూ సంయమనం పాటించాలని అమిత్‌షా సూచించారు.

English summary
Amit Shah, the BJP's president, has reportedly reassured veteran LK Advani that "the party is with you" after the Supreme Court said the 89-year-old will be tried on more serious charges for his alleged role in the 1992 demolition of the Babri Masjid mosque in Ayodhya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X