నాథూరామ్ గాడ్సే, కసబ్ కంటే రాజీవ్ గాంధీ అత్యంత క్రూరుడు: బీజేపీ ఎంపీ
బెంగళూరు: జాతిపతి మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేను స్వతంత్ర భారత మొట్టమొదటి హిందూ ఉగ్రవాదిగా పేర్కొంటూ మక్కళ్ నీథి మయ్యం అధినేత కమలహాసన్ చేసిన ప్రకటన ఓ రేంజ్‌లో ప్రకంపనలను పుట్టిస్తోంది. దాదాపు అన్ని పార్టీలూ దీనిపై స్పందించాయి. భారతీయ జనతాపార్టీ భోపాల్ లోక్‌సభ అభ్యర్థిని సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్.. ఏకంగా నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడని పేర్కొన్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యానాలపై బీజేపీ స్పందించింది. ఆమె తరఫున క్షమాపణలు కోరింది.
ఈ ఘటన చోటు చేసుకుని 24 గంటలు కూడా గడవక ముందే- బీజేపీకే చెందిన మరో లోక్‌సభ సభ్యుడొకరు రెండడుగులు ముందుకేశారు. ఈ వివాదాన్ని ఆజ్యం పోసేలా వ్యాఖ్యలు చేశారు. ఆ లోక్‌సభ సభ్యుడి పేరు నిళిన్ కుమార్ కటీల్. కర్ణాటకలోని దక్షిణ కన్నడ లోక్‌సభ స్థానం నుంచి ఆయన రెండుసార్లు గెలుపొందారు. నాథూరామ్ గాడ్సే, ముంబైపై దాడులు చేసిన ఉగ్రవాది కసబ్ కంటే రాజీవ్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని అన్నారు.

నాథూరామ్ గాడ్సే చంపింది మహత్మాగాంధీ ఒక్కరినే.. ఉగ్రవాది కసబ్ చేతుల్లో చనిపోయింది 72 మంది..రాజీవ్ గాంధీ 17 వేల మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇప్పుడు మీరే తేల్చుకోండి. ఈ ముగ్గరిలో ఎవ్వరూ అత్యంత క్రూరుడు ఎవరు? అని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. వివాదాలు చుట్టుముట్టడంతో ఈ ట్వీట్‌ను ఆయన తొలగించినట్లు తెలుస్తోంది.

సార్వత్రిక ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంటున్న కొద్దీ బీజేపీ.. తన వ్యూహాన్ని మార్చింది. రాజీవ్ గాంధీని లక్ష్యంగా చేసుకుంది. సిక్కుల ఊచకోత అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చింది. సిక్కుల ఊచకోతకు ప్రధాన కారకుడు రాజీవ్ గాంధేనంటూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. అదే లైన్‌ను పార్టీ నాయకులు అందిపుచ్చుకున్నారు. రాజీవ్ గాంధీపై విస్తృతంగా ఆరోపణలు చేస్తే వచ్చారు. సిక్కుల ఊచకోత, బోఫోర్స్ వంటి వివాదాస్పద అంశాలపై ప్రచారం చేస్తున్నారు. అదే క్రమంలో- నిళిన్ కుమార్ కటీల్ కూడా రాజీవ్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాథూరామ్, అజ్మల్ కసబ్ కంటే కూడా రాజీవ్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణించారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications