వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ ఎంపీ శ్రీరాములు శిష్యుడి హత్య: సినిమా స్ట్రైల్ లో, మహిళల చీరల్లో కారం పొడి (వీడియో)

బళ్లారీ నగర శివార్లలోని బెంగళూరు జాతీయ రహదారిలోని డాబాలో పాతకక్షల కారణంగానే బీజేపీ నాయకుడు బండి రమేష్ ను హత్య చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

|
Google Oneindia TeluguNews

బళ్లారి/బెంగళూరు: బళ్లారీ నగర శివార్లలోని బెంగళూరు జాతీయ రహదారిలోని డాబాలో పాతకక్షల కారణంగానే బీజేపీ నాయకుడు బండి రమేష్ ను హత్య చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. బండి రమేష్ డాబాలో భోజనం చెయ్యడానికి వస్తాడని ముందుగానే ప్రత్యర్థులు పసిగట్టారు.

<strong>బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు, గాలి ముఖ్య అనుచరుడి హత్య: పట్టపగలు వెంటాడి నరికేశారు !</strong>బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు, గాలి ముఖ్య అనుచరుడి హత్య: పట్టపగలు వెంటాడి నరికేశారు !

గురవారం మద్యాహ్నం బళ్లారీ- బెంగళూరు రహదారిలోని సాయి పవన్ హోటల్ (డాబా) దగ్గర బండి రమేష్ ప్రత్యర్థులు ముందుగానే మకాం వేశారు. బండి రమేష్, అతని అనుచరులు డాబాలోకి వెళ్లిన కొంత సేపటికి పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

చికెన్, మటన్ ఆర్డర్ !

చికెన్, మటన్ ఆర్డర్ !

బళ్లారి బీజేపీ ఎస్సీ, ఎస్టీ మోర్చ విభాగం ఉపాధ్యక్షుడు బండి రమేష్, అతని అనుచరులు సాయి పవన్ డాబాలోకి వెళ్లి భోజనం చెయ్యడానికి ఆర్డర్ ఇచ్చారు. డాబా సిబ్బంది చికెన్, చేపలు, మటన్, ఆమ్లేట్ రెడీ చేసి వారు కుర్చున్న టేబుల్ మీద పెట్టారు.

మహిళలు ఎంట్రీ !

మహిళలు ఎంట్రీ !

డాబాలోకి కొందరు మహిళలు ఎంట్రీ ఇచ్చారు. బండి రమేష్ కుర్చుకున్న టేబుల్ దగ్గరకు వెళ్లిన మహిళలు చీర కొంగులో ముందుగానే దాచిపెట్టి తీసుకు వచ్చిన కారం పోడి పిడికిల్లోకి తీసుకుని బండి రమేష్, ఆయన అనుచరుల కళ్లలో చల్లారు.

ఆర్తనాదాలు, అడ్డంగా నరికేశారు

బండి రమేష్, ఆయన అనుచరుల కళ్లలో కారం పోడి పడటంతో మంటలకు ఆర్తనాదాలు చేశారు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అదే సమయంలో కొన్ని వాహనాల్లో వచ్చిన ప్రత్యర్థులు వేటకోడవళ్లు తీసుకుని బండి రమేష్ ను అడ్డంగా నరికేశారు.

ప్రాణాలతో వదలం !

ప్రాణాలతో వదలం !

బండి రమేష్ ను మాత్రం ప్రాణాలతో వదలకూడదని నిర్ణయించుకున్న ప్రత్యర్థులు అతన్ని గుర్తు పట్టలేని విధంగా నరికి చంపేశారు. బండి రమేష్ అనుచరులు అందరూ పారిపోయారు. బండి రమేష్ అనుచరుడు ఒక్కడే అక్కడ ఉండటంతో బళ్లారీలోని కౌల్ బజార్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

బళ్లారీలో రౌడీషీటర్ !

బళ్లారీలో రౌడీషీటర్ !

బళ్లారీ రౌడీషీటర్ల జాబితాలో బండి రమేష్ పేరు ఉంది. బండి రమేష్ మీద ఇప్పటి వరకు అనేక కేసులు ఉన్నాయి. పలు కేసుల్లో బళ్లారీ జైల్లో ఉన్న బండి రమేష్ ఇటీవలే జామీను మీద బయటకు వచ్చాడు. బండి రమేష్ హత్యతో బళ్లారీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో సాయుధ బలగాలను రంగంలోకి దింపారు.

ఎంపీ, మాజీ ఎంపీ, మాజీ మంత్రులు

ఎంపీ, మాజీ ఎంపీ, మాజీ మంత్రులు

బళ్లారీ బీజేపీ ఎంపీ బి. శ్రీరాములు, మాజీ ఎంపీ, శాంత, మాజీ మంత్రి ఫకీరప్ప, గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులు విమ్స్ ఆసుపత్రికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకోన్నాయి. బళ్లారీ నగరంలోని పలు ప్రాంతాల్లో నిషేదాజ్ఞలు జారీ చేశారు.

శ్రీరాములకు బ్యాడ్ టైం

శ్రీరాములకు బ్యాడ్ టైం

బళ్లారీ ఎంపీ శ్రీరాములు సొంత సోదరుడు బి. గోవిందరాజులు (59) గుండెపోటుతో మరణించారు. రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్న గోవిందరాజులు శుక్రవారం సిరుగుప్ప రోడ్డులోని ఆయన ఇంటిలోనే కుప్పకూలి మరణించాడు. గోవిందరాజులకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. గురువారం అనుచరుడి హత్య, శుక్రవారం సొంత సోదరుడు మరణించడంతో శ్రీరాములు విషాదంలో మునిగిపోయారు.

English summary
A local Bharatiya Janata Party (BJP) leader Bandi Ramesh was hacked to death in Ballari in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X